పోడు భూముల పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

పోడు భూముల పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

శుక్రవారం పోడు భూముల పై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయిలో టీమ్ లను ఏర్పాటు చేసి అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు

జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అఖిలపక్ష సమావేశం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయిలో అటవీ హక్కుల కమీటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తమరి సూచనల మేరకు ముందుకు వెళ్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ శాఖ అధికారి జానకి రామ్, సంబంధిత అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

 

 

Share This Post