పోడు భూముల మరియు అటవీ సంరక్షణపై వరంగల్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం

🙏పత్రికా ప్రచురణార్థం
01/02/2023
————————————
పోడు భూముల మరియు అటవీ సంరక్షణపై వరంగల్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం.
————————————-
R.O.FR చట్టంలో చూపబడిన నిబంధనలకు లోబడి పోడు భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు
బుధవారం రోజున కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోడు భూములు అటవీ సంరక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు
ROFR జిల్లా స్థాయి కమిటీ సభ్యులుగా పాల్గొన్న జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉన్న నాలుగు మండలాల నుండి మొత్త0 7,711 మంది పట్టా పాస్ బుక్కుల కొరకు దరఖాస్తు చేసుకోగా..
గ్రామ మరియు డివిజనల్ స్థాయిలో 1,471 ధరాఖాస్తులు అనేక కారణాల చేత రిజక్ట్ చేయబడగా మిగిలిన దరఖాస్తులన్నీ అర్హత సాధించి ఉన్నతస్థాయి కమిటీకి ప0పబడ్డాయి.
మరో వారం/పది రోజుల్లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ప్రింట్ అవ్వనున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ గారు తెలిపారు.

నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 3,486 ఎకరాల ఫోడు భూమికి 58 గ్రామాల నుండి ROFR దరఖాస్తులు అందగా అటవీ హక్కుల చట్ట ప్రకారం. 2005 డిసెంబర్ 23 వ తేదీ కంటే ముందు కాస్తుల్లో ఉన్న వారినే హక్కు దారులుగా గుర్తించడం జరుగుతుందని,
నిర్ణీత సంవత్సరం తర్వాత కొత్తగా పోడు భూమి కొరకు ఎవరు చెట్లను నరికినా అట్టి సాగుదారులను అనర్హులుగా గుర్తించామని తెలిపారు.
ఖానాపురం మండలంలోని మొత్తం 9 గ్రామాలకు చెందిన రైతులు ఎన్నో ఏండ్ల నుండి కాస్తుల్లో ఉన్న వారి యొక్క సొంత భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమని చెప్పి సదరు బోర్డునుండి నోటీసులు వచ్చాయని, అయితే వాస్తవంగా గత 50 ఏండ్ల ముందు నుండే వారు పోడు భూములను సాగు చేసుకుంటున్నామని తద్వారా మాయొక్క హక్కులను గుర్తించి పట్టా పాస్ బుక్కులను అందించాలని, బాధిత రైతులతో కలిసి కలెక్టర్ గారికి విన్నవించిన ఖానాపురం మండల ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మరియు నాయకులు బత్తిని శ్రీనివాస్ నిబంధనల మేరకు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు
————————————-
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ వాత్స గారు, D.F.O అర్ఫన DTDO జాహీరుద్దీన్ గారు, RDO మహే0ధర్ నెక్కొండ మండల జెడ్పిటీసీ లావుడ్య సరోజన హరికిషన్ సంబంధితాధికారులు పాల్గొన్నారు.

Share This Post