పోడు భూముల మరియు అటవీ సంరక్షణ పై అఖిల పక్షం సమావేశం

వార్త ప్రచురణ :2
ములుగు జిల్లా :
శనివారం 30 అక్టోబర్ :
ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్సు లో పోడు భూముల మరియు అటవీ సంరక్షణ పై అఖిల పక్షం సమావేశం శనివారం రోజున జరిగినది. ఈ కార్యక్రమానికి స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎంపి కవిత ,ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూర్య, ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ పోడు చేసుకుంటున్న అర్హులందరికీ న్యాయం చేస్తూ పట్టాలు ఇచ్చి, ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుతూ.. అడవిని సంరక్షించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పమనివారు అన్నారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇటీవలే ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకుని ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేశారు.నవంబర్ 8వ తేదీ నుంచి పోడు భూములపై క్లైమ్స్ తీసుకుంటాం అని వారుఅన్నారు.ఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ములుగు అని,2006 లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని ,చట్టం వచ్చాక 6,90,059 ఎకరాలకు 2, 04,176 క్లెయిమ్స్ వస్తే 3,08,614 ఎకరాలకు సంబంధించి 96, 676 క్లెయిమ్స్ కు హక్కు పత్రాలు ఇచ్చాం అన్నారు. 3,27,880 ఎకరాలకు సంబంధించి 91,942 క్లెయిమ్స్ అనర్హత కలిగినవిగా తిరస్కరిస్తే…53,565 ఎకరాలకు సంబంధించిన 15,558 క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 68 లక్షల ఎకరాల అడవి భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారాని,2006 కు ముందే 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి సాగులో ఉందని అన్నారు. అప్పటికే పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరుగొద్దు అనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.ఇకపై ఇంకో ఇంచు అడుగు కూడా పోడు కాకుండా చూడాలని అడవిని రక్షించాలని సీఎం కేసిఆర్ గారు ఆలోచించారు.ఇపుడు మన సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణలోకి రాగానే మన దగ్గర చెట్లను చూడగానే తెలంగాణ అని తెలుస్తుంది.చాలా ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ ఫేస్ కరెంట్ లేకపోతే సీఎం కేసిఆర్ 230 కోట్ల రూపాయలు ఇచ్చారు.ఆర్. ఓ.ఎఫ్.ఆర్ అర్హులందరికీ పట్టాలు ఇస్తాం.ఈ జిల్లాలో ఫారెస్ట్ ఇబ్బందులను అధిగమించి అనుమతులు ఇవ్వడానికి లైసన్ అధికారిని నియమిస్తామన్నారు.పేదలకు మేలు చేసే విధంగానే ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి అని అన్నారు.గుత్తి కోయలు 80 గ్రామాలుగా మన రాష్ట్రంలో ఏర్పడ్డారు. ఎవరు ఎక్కడైనా బతుకొచ్చు..కానీ అక్కడి స్థానిక హక్కులు బతుకుదెరువు కోసం వచ్చిన వారికి లభించవు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల నియామకం తరవాత మళ్లీ సమావేశం ఏర్పాటు చేసుకుందాం. అర్హులందరికీ న్యాయం చేద్దాం అని వారు అన్నారు.
ఈ సందర్భంగా ఎంపి కవిత గారు మాట్లాడుతూ అఖిల పక్షం నేతలు చెప్పేది వందకు వంద శాతం నిజం అని,గతంలో పాస్ బుక్ లు ఇచ్చిన వారికి హక్కు వచ్చింది, రైతు బంధు వస్తుంది…కొంతమందికి మాత్రం పని చేయడం లేదని అన్నారు.రాజ్యాంగంలో పొందు పర్చిన వాటిని పక్కకి పెట్టకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది.సాగు చేసుకునే వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేద్దాం అనిఅన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోడు భూముల పైన ప్రజలకు పూర్తి అవగాహనా కలిగించాలని వారు అన్నారు.
ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూర్య ( సీతక్క) మాట్లాడుతూ అనేక ఉద్యమాల నేపథ్యంలో దున్నే వాడి దే భూమి అనే నినాదం వచ్చాయని, ప్రతి అసెంబ్లీ లో నా గొంతు వినిపించాను. ఏది ఏమైనా ఈ రోజు అఖిల పక్ష కమిటీ వేయడం సంతోషం అని అన్నారు. అడవి హక్కు చట్టం ప్రకారం సాగులో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించాలని వారు అన్నారు. ఇప్పటి నుండి అడవులను రక్షించుకోవాలని కమిటీ వేయాలని అన్నారు. అంతటా అడవులు పెంచాలి.ములుగు జిల్లాలో నీటి సౌకర్యం ఉన్నా ఒక్క పంట మాత్రమే పండుతుందని, వారు అన్నారు.మానవత్వం తో అన్నదమ్ముల కలిసి ఉందాం – అడవిని కాపాడ దాo అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ ప్రతి ఆవాసానికి frc(ఫారెస్ట్ రైట్స్ కమిటీ) ఏర్పాటు చేస్తాం అని, గ్రామ సభ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని వారు అన్నారు.2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మాప్స్ మా దగ్గర ఉన్నాయన్నారు.చట్టబద్ధ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రం వస్తుందని వారు అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీమతి నాగ జ్యోతి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశిష్ ,ఎస్పి సంగ్రామ్ సింగ్, డిఅర్వో రమాదేవి, రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య అఖిల పక్ష నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Share This Post