పోడు భూముల వివరాల సేకరణ మరియు రిజీష్టర్లను సక్రమంగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం….2 తేదిః 11-11-2021
పోడు భూముల వివరాల సేకరణ మరియు రిజీష్టర్లను సక్రమంగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 11:
జిల్లాలోని గ్రామ పంచాయితీలలో పోడు భూముల FRC రిజిష్టర్లు, మరియు క్లయిమ్ రిజిష్టర్ లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం పోడు భూముల పై అధికారులతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పోడు భూముల వివరాల సేకరణ కొరకు ఏర్పాటు చేసిన అధికారులు బృందం బాగా పనిచేస్తుందని అభినందించారు. జిల్లాలో 47 గ్రామపంచాయితీలు, 2 హబిటేషన్లలో మొదటి విడతలో గ్రామసభలు నిర్వహించడం పూర్తయి లబ్దిదారులకు ఫామ్-ఏ1, క్లైములు, లను అందించి వారి నుండి ధరఖాస్తులను తిరిగి పొందాలని, పోడుపై ప్రజల్లో ఉన్న సందేహలను నివృత్తి చేయాలని, అధికారులకు ఎవైన సందేహాలను గురించి మీ దృష్టికి వచ్చినట్లయితే పై అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని, చట్టానికి లోబడే అధికారులు వ్యవహరించాలని, నేటి వరకు పూర్తయి వారు మండలం, హబిటేషన్లను వారిగా వివరాలను మరోసారి సరిచూసుకోవాలని, ఈ ప్రక్రియలో అధికారులు అలసత్వం వహించారాదని తెలియచేసారు.
రిజిష్టర్లను గ్రామపంచాయితి సెక్రటరీలు, FRC చైర్మన్/సెక్రటరీలు వర్గాల వారిగా వివరాలను నిర్దేశించిన మేరకు నమోదు చేయాలని పేర్కోన్నారు. రెండవ విజిట్ రేపటి ఉదయం నుండి ప్రారంభ కావాలని, క్లైయిలు ఇచ్చిన వాటిని స్వీకరించాలని, A1 – క్లైముల రిజిష్టర్ ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామపంచాయితిలో క్లేయిము రిజిష్టర్లను అభ్యర్థుల పూర్తివివరాలతో పంచాయితి సెక్రటరి క్లెయిము రిజిష్టరును నిర్వహించాలని, గ్రామ సభలు నిర్వహించి మీటింగ్ మినట్స్ నమోదు, సభ్యుల ఎన్నికలను నమోదు చేయాలని, వర్గాల వారిగా స్వీకరించిన ధరఖాస్తుల వివరాలను నమోదు చేయాలని, గ్రామపంచాయితి, FRC చైర్మన్, సెక్రటరి రేపు ఉదయం నుండి అందుబాటులో ఉండాలని, లబ్దిదారుల ఇచ్చిన వివరాలను మరో సారి సరిచూసుకోని, క్షేత్ర పరిశీలన చేయాలని పేర్కోన్నారు.
అనంతరం వివిధ రెవెన్యూ అంశాలపై చర్చిస్తూ, కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ ధరఖాస్తుల చర్యలపై అధికారులు అలస్యం జరగకుండా చూడాలని, సారంగపూర్ మండలంలో పెండింగ్ లో ఉన్న ఆదాయం, కుల దృవీకరణలను విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నట్లు దృష్టికి వచ్చినందున నేటి రాత్రిలోగా పూర్తిచేయాలని, ఇంచార్జీ తహసీల్దార్ భీర్పూర్ గారిని ఆదేశించారు. ఎస్.ఎల్.ఏలో ఉన్నవాటి గురించి ఆగకుండా క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్లను జారిచేయాలని, సర్టిఫికేట్ల ద్వారా ఏ విద్యార్థులు ఇబ్బందుల పడకూడదని అధికారులను ఆదేశించారు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదైనప్పుడు, కోర్టు కేసులు, సీలింగ్ భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి, పాతరికార్డుల ద్వారా పూర్తి అవగాహన పొందిన తరువాత చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యల నిర్వహణపై అధికారులు బాగా పనిచేస్తున్నారని భూముల రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకోని పెండింగ్ లేకుండా చూడాలని, పెండింగ్ లో ఉన్న పిపిబి కోర్టు కేసులపై చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రి లేకుండా చూడాలని, ఈపి శాతం తక్కువగా ఉండెలా చూడాలని, అలాగే వ్యాక్సినేషన్ పై వైద్యాఆరోగ్య శాఖా మాత్యులు శనివారం సమీక్షించనున్నారని, వ్యాక్సిన్ ఇంకా తీసుకోవాల్సిన వారిని గుర్తించి, వెంటనే పూర్తయ్యేలా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఆర్.డి.ఓలు, మండల ప్రత్యేక అధికారులు, అటవీశాఖఅధికారులు, తహసీల్దార్లు , ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోడు భూముల వివరాల సేకరణ మరియు రిజీష్టర్లను సక్రమంగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post