పోడు భూముల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తు౦దని రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి పేర్కొన్నారు.

శనివారం నాడు కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి అద్వర్యంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, బి. గోపి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉషారాణి, అటవీ, రెవిన్యూ శాఖ అధికారులతో పోడు భూముల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ పోడు సాగుచేస్తూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలందరికీ తప్పనిసరిగా ROFR పట్టాలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిలో పునరావాసం కల్పించాలని, జీవనోపాధికి అవసరమైన చర్యలు తిసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించినట్లుగా ఆమె వివరించారు. అర్హులైన పేదలందరికీ పట్టా భూములతో ప్రయోజనం పొందేలా అధికారులు తగిన కృషి చేయాలనీ ఆమె సూచించారు. అటవీ భూముల సంరక్షణకు పకడ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాల అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పోడు కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆమె అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ హైదరాబాద్ లో 2021 అక్టోబర్ 23 వ తేదీన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. పోడు భూములను పర్యవేక్షించడానికి ఐదు ఫారెస్ట్ రిజర్వ్ కమీటీ లను ఏర్పాటు చేశామని, వీరికి పరిపాలనా పరమైన సహాయ, సహకారాన్ని అందించడానికి గ్రామపంచాయతీ స్థాయిలో ఐదు బృందాలను ఏర్పాటుచేసామని అన్నారు. డివిజన్, మండల స్తాయిలలో ఇద్దరు సీనియర్ జిల్లా స్తాయి అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. పోడుసాగు పట్టా దరఖాస్తు స్వీకరణకు అవసరమైన శిక్షణను ఇప్పటికే ఇచ్చినట్లు కలెక్టర్ ఆమెకు వివరించారు.

ఈ సమావేశంలో డి ఎఫ్ ఓ నాగభూషణం అదనపు కలెక్టర్లు సంద్యారాణి, హరిసింగ్,
డి టి డి ఓలు ప్రేమకల, జహిరోద్దిన్, డి పి ఓలు జగదీశ్వర్, ప్రభాకర్, ఆర్ డి ఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share This Post