పోడు భూముల సమస్యల పరిష్కారానికి స్వీకరిస్తున్న క్లైమ్ లను గ్రామ పంచాయితీ కార్యదర్శులు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి క్లయిమ్ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు 11, ఖమ్మం –

పోడు భూముల సమస్యల పరిష్కారానికి స్వీకరిస్తున్న  క్లైమ్ లను గ్రామ పంచాయితీ కార్యదర్శులు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి క్లయిమ్ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం పెనుబల్లి మండలం భాపన్నపాలెం గ్రామ పంచాయితీ పరిధిలోని పెరికకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొని క్లయిమ్లు సమర్పించడం పట్ల అదేవిధంగా ఫారెస్ట్ రైట్ కమిటీల బాధ్యతలు, విధుల పట్ల సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవన అవసరాల కోసం గత కొన్ని ఏండ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు హక్కు పత్రాలు కల్పించి ఇకముందు భవిష్యత్తులో ఒక ఇంచు కూడా అటవీ సంపద అన్యాక్రాంతం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్య పరిష్కారానికి నిర్ణయించిందని. కలెక్టర్ తెలిపారు. గతంలో రెండు పర్యాయాలు అటవీ హక్కుల చట్టం క్రింద పట్టాలు జారీచేయడం జరిగిందని. అట్టి సమయంలో అర్హులుగా ఉన్నప్పటికి హక్కు పత్రాలు రానివారు, అటవీ భూమి సాగుచేసుకుంటున్న పోడు వ్యవసాయదారులందరూ తప్పనిసరిగా క్లయిమ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శి నుండి దరఖాస్తు ఫారం పొంది వివరాలను పొందుపర్చి అవసరమైన దృవీకరణ పత్రాలను జతపర్చాలని, కులం ధృవీకరణ పత్రం లేనివారు దరఖాస్తు చేసుకున్న వెంటనే కులధృవీకరణ పత్రాలను జారీ చేస్తామని తదనుగుణంగా తహశీల్దార్లు, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం స్వీకరిస్తున్న. దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశీలన చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇంకనూ అటవీ భూమి కలిగి క్లయిమ్ చేసుకోని వారు సత్వరమే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

మండల స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, కల్లూరు ఆర్.డి.ఓ సూర్యనారాయణ, తహశీల్దారు రమాదేవి, ఎం.పి.డి.ఓ మహాలక్ష్మీ, సర్పంచ్ సోడే రాంబాబు, పంచాయితీ కార్యదర్శి డి. రవికుమార్, ఫారెస్ట్ రైట్ కమిటీ సభ్యులు, పోడు వ్యవసాయదారులు తదితురులు పాల్గొన్నారు.

Share This Post