పోడు భూముల సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలననుసరించి అర్హులకు చట్ట, ప్రకారం పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం ఇల్లందు మండలం, సుదిమళ్ల గ్రామ పంచాయతీలో అటవీ హక్కులపై అవగాహన సదస్సు మరియు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాలన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోడు భూములకు హక్కు పత్రాలు కల్పన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎవరి ప్రలోభాలకు గురికాకుండా యంత్రాంగం సలహాలు, సూచనలతో తప్పులు లేకుండా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ముందుకు వచ్చిందని, గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లుతో సమావేశం నిర్వహించి పోడు సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కట్టుబడి సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు పోడు సమస్యలున్న గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ధరఖాస్తులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 11 నుండి 12వ తేదీ వరకు దరఖాస్తులు ప్రజల నుండి తిగిరి తీసుకోవడం జరుగుతుందని, అధికారులు సూచించిన మేరకు దరఖాస్తులను సక్రమంగా పూరించాలని చెప్పారు. హక్కు పత్రాలు ఇప్పిస్తామని ఎవరైనా మాయమాటలు చెప్తే నమ్మొద్దని, నేరుగా కార్యదర్శికి కానీ ఇతర అధికారులకు కానీ పిర్యాదు చేస్తే అటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని చెప్పారు. దరఖాస్తులను ఉచితంగా అందచేస్తున్నామని, ఎవరికి ఒక్క రూపాయు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అడవుల సంరక్షణ బాధ్యత గ్రామ సర్పంచులపై ఉన్నదని చెప్పారు. రెవిన్యూ, అటవీ భూముల సమస్యలపై సమగ్ర నివేదికలు అందచేయాలని తహసిల్దారు ఆదేశించారు. తజిల్లాలోని 343 గ్రామ పంచాయతీలలోని 702 హాబిటేషన్లులో పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీలను నియమించినట్లు చెప్పారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు గ్రామపంచాయతీని ప్రామాణికంగా తీసుకుని షెడ్యూలు తయారు చేయాలని చెప్పారు. 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులు పాటు ప్రజల నుండి స్వీకరించిన ప్రతి ధరఖాస్తును రిజిష్టరులో నమోదులు చేసి దరఖాస్తు దారునికి రశీదు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యంపిపి చీమల నాగరత్నం, మండల ప్రత్యేక అధికారి మరియన్న, తహసిల్దార్ క్రిష్ణవేణి, యంపిడిఓ అప్పారావు, యంపిఓ అరుణ్ గౌడ్, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ క్రిష్ణ, వైస్ యంపిపి ప్రమాదక్కుమార్, కార్యదర్శి నాగమణి, విఆర్ఎ మహేష్ కుమార్, ఎఫ్ఓ గౌరమ్మ, పిఎసిఎస్ చైర్మన్ మెట్ల క్రిష్ణ, పాల్గొన్నారు..

Share This Post