పోడు భూముల సమస్య పై ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు

పోడు భూముల సమస్య పై ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.గత నెలలో పోడు వ్యవసాయం పై హైదరాబాద్ లో సమావేశం జరిగిందని అన్నారు.    గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో  శుక్రవారం ఆర్.డి.ఓ.లు,తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఓ.లు,అటవీ అభివృద్ధి అధికారులు,అటవీ సెక్షన్ అధికారులతో పొడు భూములు సమస్య పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం  2005 ప్రకారం అటవీ హక్కుల కు అర్హులైన వారు  సాంకేతిక కారణాలు,చిన్న చిన్న సమస్యలు, సమాచారం లేక దరఖాస్తు చేసుకొలేక పోయారని అన్నారు.జిల్లాలో 13 మండలాల్లో పొడు సమస్య ఉందని అన్నారు పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారి నుండి నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని,ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కమీటీ లు స్వీకరించాలని అన్నారు.గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనల నముసరించి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ కమిటీ లు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఏర్పాటు చేయాలని అన్నారు. 15 మంది వరకు సభ్యులను కమిటీ లో నియమించుకోవాలని, కోరారు. కమిటీలో 1/3 ఎస్టీలు ఉండాలని చెప్పారు.1/3 మహిళలు ఉండేవిధంగా చూసుకోవాలని తెలిపారు. మండల లెవెల్, డివిజనల్ లెవెల్, జిల్లా లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ గ్రామ కమిటీ లు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్హతగల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామ కమిటీ సభ్యులకు సందేహాలు ఉంటే మండల అటవీ హక్కుల కమిటీకి తెలియజేసి  నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కమిటీ ల ఏర్పాటు,దరఖాస్తుల స్వీకరణ,తరువాత అటవీ,రెవెన్యూ అధికారులు విచారణ తదితర విషయాలను కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి రాం బాబు, ఆర్డివో లు రోహిత్ సింగ్(మిర్యాలగూడ),గోపి రాం (దేవర కొండ), అటవీ, రెవెన్యూ,పంచాయతి రాజ్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post