పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*

పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*
# పోడు భూముల సమస్య పరిష్కారం,అటవీ సంరక్షణపై జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అఖిల పక్ష సమావేశం
# హాజరైన ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీల ప్రతినిధులు,ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీల నాయకులు
నల్గొండ,నవంబర్ 7. జిల్లాలో పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారం తో పాటు  అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి  స్పష్టం చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపుటకు, దీనితోపాటు  భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి జి. జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతకుముందు అఖిలపక్ష సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సలహాలను, సూచనలను అందజేశారు.
 ఎం.పి.ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్,రవీంద్ర కుమార్,భాస్కర్ రావు,గాధరి కిశోర్,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రాం చంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్,సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి  యం.సుధాకర్ రెడ్డి,టి.డి.పి నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు దుర్గా ప్రసాద్,టి.ఆర్.ఎస్.జిల్లా అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, సి.పి.ఐ పట్టణ కార్యదర్శి  గాదె పాక రమేష్,ఎం.ఐ. ఎం.నుండి ఖాజా గౌస్ మహియుద్దీన్ హషం, తెలంగాణ గిరిజన సంఘం  జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్,తెలంగాణ రైతు సంఘం నుండి నాగి రెడ్డి,పోడు సమస్య ఉన్న 13 మండలాలకు చెందిన ఎం.పి.పి.లు,జడ్.పి.టి.సి.లు
గిరిజన సంఘాల నాయకులు అఖిల పక్ష సమావేశంలో పాల్గొని తమ సలహాలను,సూచనలు అంద చేశారు.ప్రభుత్వం పోడు సమస్య పరిష్కారానికి చేస్తున్న కృషికి అన్ని పార్టీల నాయకులు స్వాగతిస్తూ ఏకగ్రీవంగా మద్దతు పలికారు.మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు మంత్రి  ధన్య వాదాలు తెలిపారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల కతీతంగా ,పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు.నిరు పేదలైన వారికి న్యాయం జరగడం తో పాటు అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా అటవీ హక్కుల చట్టం- 2005 నియమనిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిష్కారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి అన్నారు. నల్గొండ జిల్లాలో17 లక్షల 59 వేల 885 ఎకరాల జియోగ్రఫీ ప్రాంతం కాగా ఒక లక్ష 56 వేల 164 ఎకరాలలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందని, జిల్లాలోని 13 మండలాల్లో 63 గ్రామాల్లో 164 హ్యాబిటేషన్ లలో 13771 వేల ఎకరాల అటవీ  భూమి ఆక్రమణలో ఉందని మంత్రి తెలిపారు. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, తాను కూడా సబ్ కమిటీ లో సభ్యునిగా ఉన్నానని, అటవీ హక్కుల చట్టం- 2005 పరిధి కి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చేందుకు అఖిలపక్ష సభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని, రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్.2005 చట్టం,గ్రామ కమిటీ లు హ్యాబిటేషన్ వారీగా,డివిజన్ వారీగా,జిల్లా కమిటీ లు ఏర్పాటు,కమిటీ ల బాధ్యతలు గురించి మంత్రి వివరించి సందేహాలు నివృత్తి చేశారు. పోడు పేరు పై ఇకముందు అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని, అడవుల నరికివేత వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు. హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకుంటున్న కార్యక్రమాలలో అటవీ శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రజా ఉద్యమం గా  పెద్ద ఎత్తున భాగస్వాములై చెట్లు నాటుతున్నారని,హరిత హారం ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉండగా,జిల్లాలో 9 శాతం అటవీ విస్తీర్ణం ఉందని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కట్టుబడి ఉండాలని,మానవ,జీవ జాతుల మనుగడ అడవుల సంరక్షన పై ఆధారపడి ఉందని అన్నారు.అడవుల క్షీణత  వలన గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని,పర్యావరణ సమస్యలు వస్తున్నాయని అన్నారు.అడవుల పునరుద్ధరణ లో దేశం లో రాష్ట్రం ముందు ఉందని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కు రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు లు కల్పించేందుకు చర్యలు తెరసుకుంటామని అన్నారు. సమస్య పరిష్కారం చర్యలకు గాను అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పారదర్శకంగా తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పోడు వ్యవసాయదారులకు అటవీ హక్కుల కల్పన కు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాలో పోడు సాగు చెడుకుంటున్న వ్యవసాయ దారుల నుండి నవంబర్ 8 నుండి క్లయిమ్స్ సేకరణ నిర్వహణ పై చేయనున్నట్లు,అనంతరం పరిశీలన క్షేత్రస్థాయి సందర్శన, సర్వే తదితర ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు, ఫారెస్ట్ రైట్ కమిటీలు, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని,గ్రామ స్థాయి కమిటీలు గ్రామాల్లో అవగాహన కలిగిస్తాయని అన్నారు.పోడు వ్యవసాయ దారుల నుండి  దరఖాస్తులు ఫారం ఏ లో స్వీకరిస్తామని అన్నారు.వారం రోజులు స్వీకరించిన అనంతరం వేరిఫి కేషన్ ఉంటుందని అన్నారు. జిల్లాలోని అడవి దేవుల పల్లి,చందం పేట,చింత పల్లి,దామర చర్ల,దేవరకొండ,గుండ్ల పల్లి,మిర్యాలగూడ, నేరేడు గొమ్ము, నిడమనూర్,పి.ఏ.పల్లి,పెద్ద వూర,తిరుమల గిరి సాగర్,త్రిపురారం, మండలాలలో పోడు సమస్య  ఉందని, సంబంధిత  ఫారెస్ట్ రైట్ కమిటీ లు,సబ్ డివిజన్ కమిటీ,జిల్లా స్థాయి కమిటీ ల ద్వారా  పోడు సమస్య కు ప్రభుత్వ ఆదేశాలు, ఆర్.ఓ.ఎఫ్.ఆర్.చట్టం ననుసరించి పరిష్కార చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. క్లయిమ్ చేసుకోని వారికి ఇది సదవకాశమని, అందిన క్లయిమ్స్ పై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.సమావేశం లో హాజరైన ప్రజా ప్రతినిధులు,అధికారులతో ఇక ముందు ఎలాంటి అన్యా క్రాంతం ,ఆక్రమణలు జరుగనీయమని,ఇప్పటి వరకు అటవీ భూముల్లో ఉన్న అర్హులైన వారికి హక్కులు కల్పించిన పిమ్మట ఎలాంటి ఆక్రమణలు అనుమతించ బోమని అందరి చే జిల్లా కలెక్టర్ అటవీ సంరక్షణ ప్రతిజ్ఞ చేపించారు. అలాగే అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు ROFR చట్ట ప్రకారం హక్కు పత్రం ఇచ్చుటకు,ఇకపై అటవీ భూముల ఆక్రమణకు గురి కాకుండా చూచుటకు తీర్మానించారు. జిల్లా ఆటవీ సంరక్షణ కమిటీ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, క్షీణించిన అడవులను పునరుద్ధరించి అభివృద్ధి పరచుటకు సమావేశం తీర్మానించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ,జిల్లా అటవీ శాఖ అధికారి రాంబాబు,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,మిర్యాలగూడ, దేవర కొండ ఆర్.డి.ఓ.లు రోహిత్ సింగ్,గోపి రాం, పోలీస్ అటవి శాఖ జిల్లా అధికారులు,మిర్యాలగూడ డి.ఎస్.పి.వై.వెంకటేశ్వర్ రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అఖిలపక్ష ప్రతినిధులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post