పోడు భూముల సర్వే నిర్వహణపై నవంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించుటకు షెడ్యూలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

నవంబర్ 06, 2021::- శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి మండల ప్రత్యేక అధికారులు, రెవిన్యూ, పంచాయతీ, అటవీ అధికారులతో అవగాహన కార్యక్రమాలు, క్లెయిమ్స్ స్వీకరణపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 702 హాబిటేషన్లులో అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు 343 గ్రామ పంచాయతీలకు కమిటీలను నియమించినట్లు చెప్పారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు గ్రామపంచాయతీని ప్రామాణికంగా తీసుకుని షెడ్యూలు తయారు చేయాలని చెప్పారు. 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులు ప్రజల నుండి ధరఖాస్తులు స్వీకరించి ప్రతి దరఖాస్తును రిజిష్టరులో నమోదు చేయాలని చెప్పారు. వచ్చిన దరఖాస్తులను తహసిల్దార్ కార్యాలయంలో బద్రపరచాలని చెప్పారు. ప్రతి హాబిటేషన్కు అటవీ హక్కుల కమిటి ఉంటుందని కమిటిలో 10-15 మంది వరకు సభ్యులు ఉంటారని చెప్పారు. పూర్తి అవగాహన ద్వారా మాత్రమే సర్వే ప్రక్రియ సులభంగా జరుగుతుందని, ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరంగా తెలియచేయాలని చెప్పారు. అవగాహన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని యంత్రాంగం అధికారులు అందరూ కల్సికట్టుగా పనిచేసే పని కాబట్టి తప్పక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. జిల్లాలో 343 గ్రామ పంచాయతీల్లోని 702 హాబిటేషన్లులో పోడు సమస్య ఉన్నందున ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం చొప్పున మొత్తం 343 టీములను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించుటకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎక్కువ హాబిటేషన్లున్న గ్రామ పంచాయతీల్లో అన్ని హాబిటేషన్లు కవరు చేయాలని చెప్పారు. ధరఖాస్తులతో పాటు జతచేయాల్సిన ఆధారాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సర్వే ప్రక్రియ నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి సన్నద్ధం చేయాలని చెప్పారు. హాబిటేషన్లులో అటవీ హక్కుల రక్షణ కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. గ్రామస్థాయి కమిటి ప్రజల నుండి క్లెయిమ్స్ స్వీకరించడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి నుండి క్లెయిమ్స్ స్వీకరించడం. జరుగుతుందని, ప్రజల నుండి స్వీకరించిన క్లెయిమ్లను రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. ఎవరి నుండి క్లెయిమ్స్ తీసుకోమని చెప్పొద్దని తప్పని సరిగా క్లెయిమ్స్ స్వీకరించాలని చెప్పారు. అవగాహన సదస్సులో అడవుల సంరక్షణపై కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. అడవుల నరికివేతను ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని పోదుతో పాటు అడవుల సంరక్షణ కూడా చాలా ముఖ్యమని, అటవీ అధికారులు, గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అడవుల సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని చెప్పారు. అడవుల నరికివేత జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్వే ప్రక్రియను మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. క్లెయిమ్ ఫారాలను ఉచితంగా అందచేస్తున్నామని, ఇట్టి ఫారాలకు ప్రజల నుండి ఒక్క రూపాయి తీసుకోవద్దని, ప్రజలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారుల పర్యవేణక్షతో పాటు టాస్క్ఫోర్సు, విజిలెన్సు టీములు పటిష్ట పర్యవేక్షణ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర అశోకచక్రవర్తి, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post