పోడు భూముల సర్వే ప్రణాళిక ప్రకారం చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో పోడు భూముల సర్వే ప్రణాళికబద్దంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులుతో సర్వేకు సంబంధించిన విధివిధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో పోడు భూముల సర్వే పకదృందీగా నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా 263 గ్రామ పంచాయతీలలో షెడ్యూల్‌ కులాల వారు 13 వేల 177 మంది, ఇతరులు 13 వేల 503 మంది నుండి దరఖాస్తులు వచ్చాయని, వీటిని పరిశీలించి గ్రామపంచాయతీల వారిగా వచ్చిన దరఖాస్తులు, పరిష్కార సమయం, సంబంధిత వివరాలో ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించి 51 వేల 859 ఎకరాల భూమి ఉండగా, ఇతరులకు సంబంధించి 44 వేల 267 ఎకరాలు ఉందని, గుర్తించిన గ్రామపంచాయతీలలో హ్యాబిటేషన్‌ల వారిగా దరఖాస్తుదారులు భూమి వివరాలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు రాగానే కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంటుందని, అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారామ్‌, జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్‌ రెడ్డి, ఆయా
మండలాల తహశిల్టార్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, అటవీ రేంజ్‌ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post