పోడు భూముల హక్కు పత్రాల విషయమై చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పోడు భూముల హక్కు పత్రాల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 94 గ్రామ పంచాయతీల్లోని 132 ఆవాసాల్లో హక్కుల కోసం 18295 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, గ్రామ సభల నిర్వహణ పూర్తయినట్లు ఆయన అన్నారు. పోడు భూముల సర్వే, మ్యాప్ తయారీ పూర్తయినట్లు ఆయన తెలిపారు. తదుపరి సబ్ డివిజన్ స్థాయి సమావేశాలు చేపడుతున్నట్లు, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. డివిజన్ స్థాయి సమావేశాలు పూర్తి చేసుకొని, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రక్రియను పూర్తి పారదర్శకంగా త్వరితగతిన పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎఫ్డివోలు ప్రకాష్ రావు, మంజుల, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు.