పోడు భూ సమస్యల పరిష్కారం పై వీసి నిర్వహించిన జిల్లా కలెక్టర్


నవంబర్ 8 నుండి గ్రామ స్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై అవగాహన మరియు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
11 మండలాలోని 54 గ్రామాలో అటవీ భూముల ఆక్రమణ గుర్తింపు
ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటి ఏర్పాటు
ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహణ
గ్రామ సభల నిర్వహణ షెడ్యుల్ సిద్దం చేయాలి
ఇంచ్ భూమి సైతం తదుపరి ఆక్రమణకు గురికాకుండా గ్రామసభ తీర్మానం
అడవుల పునరుజ్జీవనం చేసేదిశగా పటిష్టమైన చర్యలు
ఆర్వోఎఫ్ఆర్ చట్టం పై అవగాహన కల్పించాలి
పోడు భూముల దరఖాస్తుల స్వికరణ పై అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , నవంబర్ 06:-
నవంబర్ 8 నుంచి ఆర్వోఎఫ్ఆర్ పట్టా దరఖాస్తుల పై గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ అంశం పై శనివారం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. పోడు సాగు భూముల సమస్యను పరిష్కరించడానికి సీఎం కేసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పకడ్భందిగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన జిల్లాలో దాదాపు 76వేల అటవీ భూములు ఉన్నాయని, వాటిలో 11 మండలాల పరిధిలోని 54 గ్రామాలో 5074 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ నివేదిక ద్వారా తెలుస్తుందని కలెక్టర్ తెలిపారు ప్రతి గ్రామంలో సర్పంచ్, విఆర్ఎ, అటవీ బీట్ అధికారి, పంచాయతి కార్యదర్శీ బృందంగా ఏర్పడి పోడు భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యూహం పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 కంటే ముందు నుంచి సాగు చేసుకునే వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేయడం జరుగుతుందని, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను సాధారణంగా గిరిజనలకు జారీ చేస్తామని, 3 తరాల వాళ్లు ఆ భూమి పై హక్కు కల్గి ఉన్నారని నిరుపించిన నేపథ్యంలో గిరిజనేతరులకు సైతం పట్టా జారీ చేయడం జరుగుతందని అన్నారు. నవంబర్ 8న జిల్లాలోని 54 గ్రామాలో ఆర్వోఎఫ్ఆర్ చట్టం, పోడు సాగు పట్టా దరఖాస్తు విధానం, జత చేయాల్సిన పత్రాలు తదితర అంశాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామ సభ నిర్వహించాలని, దరఖాస్తులను స్వీకరణ ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు గ్రామ సభ నిర్వహించే షెడ్యుల్ పై ముందస్తుగా గ్రామస్థులకు, సదరు అటవీ భూమి సాగుచేసుకుంటున్న వారికి సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలకు తప్పనిసరిగా భూ ఆక్రమణదారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఒకే గ్రామంలో రెండు ఆవాసా లలో అటవీ భూముల ఆక్రమణ జరిగితే 2 ప్రదేశాలలో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలోని 54 గ్రామాలో 10 నుంచి 15 మంది వ్యక్తులతో గ్రామ అటవీ హక్కుల కమిటిలను సోమవారం ఏంపీక చేయాలని, వీటిలో కనీసం 1/3rd గిరిజనలు లేదా మహిళలు ఉండేలా చుడాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో సైతం అటవీ హక్కుల కమిటిలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం, దరఖాస్తు చేసుకునే విధానం వంటి వాటి పై అవగాహన కల్పించిన తరువాత పంచా యతి కార్యాలయంలో పంచాయతి కార్యదర్శి దరఖాస్తులను స్వికరించాలని, దీని పై వారికి ఎంపిడిఒలు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో మరో ఇంచ్ అటవీ భూమి ఆక్రమణకు పాల్పడకుండా సంబంధిత గ్రామ సభ తీర్మానించాలని కలెక్టర్ తెలిపారు గ్రామంలో పోడు భూముల ఆర్వోఎఫ్ఆర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను అటవీ హక్కు కమిటి ద్వారా మండల , డివిజన్ స్థాయి కమిటిలకు పంపాలని తెలిపారు. అనంతరం రెండవ దశలో సదరు దరఖాస్తులకు సంబంధించి విచారణ అంశం పై జిల్లా స్థాయిలో తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ప్రస్తుతం పోడు సాగు పట్టా దరఖాస్తుల స్వికరణ పై శ్రద్ద వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు జిల్లాలో పోడు సాగుకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన తరువాత మిగిలిన అటవీ భూమి పకడ్భందిగా సంరక్షించుకోవాలని తెలిపారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,  జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

Share This Post