*పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు సియం కేసీఆర్ కృషి* *పర్యావరణాన్ని కాపాడుతూనే పోడు రైతులకు హక్కులు**అటవీ పరిరక్షణకు అన్ని వర్గాలు కృషి చేయాలని పిలుపు* *అర్హులైన వారికి అందేలా చూడాలని అఖిలపక్షం నేతలకు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిల సూచనలు*

పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సియం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు చెప్పారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ హక్కుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో  మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ఎమ్పీలు డా.బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు మండల ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు గిరిజన, గిరిజనేతరుల సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అటవీ సంపదతో జీవనం సాగిస్తూనే.. పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సియం గారు నిర్ణయించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టారని అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే.. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి పట్టాలిచ్చేందుకు కృషి జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా అటవీ హక్కుల చట్టం-2006 అమలుకు సియం గారి కృషిలో భాగంగా 2005 డిసెంబర్13కు ముందు ఆక్రమణలో ఉన్న అర్హులైన రైతులకు మాత్రమే పట్టాలు అందే విధంగా అన్ని పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల పేరుతో యంత్రాల ద్వారా అడవులను కొల్లగొడుతున్న వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
నిజమైన అటవీ పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, పర్యావరణం పరిరక్షణకు అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు.
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ అఖిల పక్ష సమావేశం ఎర్పాటు చేయడం జరిగిందని, అర్హులకు హక్కులు కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సన్నదతతో ఉన్నదని,తెలిపారు.పోడు భూములపై, అడవుల సంరక్షణ పై గతంలో తీసుకున్న చర్యలపై, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమంపై వివరించారు.

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ గ్రామం, మండలానికి సంభందించిన, ఏళ్ల తరబడి పొడు వ్యవసాయం చేస్తూ ఇతర ఆధారం లేక దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న నిజమైన హక్కు దారునికి
హక్కులు కల్పించి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.

Share This Post