పోడు వ్యవసాయం చేస్తున్న వారికి అర్హత మేరకు హక్కులు కల్పిస్తాం…

ప్రచురణార్థం

పోడు వ్యవసాయం చేస్తున్న వారికి అర్హత మేరకు హక్కులు కల్పిస్తాం…

మహబూబాబాద్, 2021 నవంబర్-02:

పోడు వ్యవసాయం చేస్తున్న వారికి అర్హత మేరకు హక్కులు కల్పించేందుకు పార్టీల ప్రతినిధులు సహకరించాలని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

మంగళవారం స్థానిక గిరిజన భవన్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అధికారులతో ఎర్పాటు చేసిన అడవుల సంరక్షణ, పోడు భూముల అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ, పొడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలంటూ గిరిజనులు కోరుతున్నారని, పొడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు వారి హక్కులను కాపాడుతూ, అటవీ సంపద తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యను అందరం కలిసి కట్టుగా చర్చించుకొని జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న అర్హత మేరకు గిరిజనులకు హక్కులు కల్పించుట కు కృషి చేద్దామన్నారు.

అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందు అటవీ భూములను సాగుచేసుకుంటున్న పోడుదారులను గుర్తించి వారికి హక్కులు కల్పించాల్సి ఉందన్నారు.

8వ తేదీ లోగా కమిటీ లను ఏర్పాటు చేసుకుని గ్రామస్థుల సమక్షంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

పోడు చేస్తున్న వారి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు, పోడు చేస్తున్న వారికి హక్కులు కల్పిస్తూ అడవుల సంరక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించి ఉన్నారన్నారు.

పోడు హక్కులు కల్పించి సాగు కు యోగ్యంగా భూములను తీర్చి దిద్దుతమని, అట్టి భూములకు సదుపాయాలు కల్పించి రెండు పంటలు పండించు కునే విధంగా తీర్చి దిద్దుతామని, రైతుబందు అందించుటకు చర్యలు చేపడతామన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ అఖిల పక్ష సమావేశం ఎర్పాటు చేయడం జరిగిందని, అర్హులకు హక్కులు కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సన్నదతతో ఉన్నదని, దరఖాస్తులను గ్రామ స్థాయిలో అందించడం జరుగుతుందని, దరఖాస్తులు నింపడం రాని వారికోసం ప్రభుత్వ సిబ్బందిని ఎర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 8న గ్రామస్థాయిలో నిర్వహించే గ్రామ సభలో మాత్రమే దరఖాస్తులను అందించాలని, అర్హత వున్న వారు గ్రామ స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలని, గ్రామసభ ద్వారా, వెరిఫికేషన్ టీమ్ సభ్యులచే అట్టి దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అనంతరం గ్రామ స్థాయి నుండి డివిజన్ స్థాయి కమిటీ వద్దకు వస్తాయని, అక్కడ పరిశీలన చేసిన అనంతరం జిల్లా స్థాయి కమిటీ కి చేరిన తర్వాత అర్హత మేరకు దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా పోడు భూములపై, అడవుల సంరక్షణ పై గతంలో తీసుకున్న చర్యలపై, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమం పై కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమ్లా నాయక్, ఐటీడీఎ పి. ఓ. గౌతం వివరించారు.

ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ గ్రామం, మండలానికి సంభందించిన, ఏళ్ల తరబడి పొడు వ్యవసాయం చేస్తూ ఇతర ఆధారం లేక దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న నిజమైన హక్కు దారునికి
హక్కులు కల్పించి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. అడవులను సంరక్షిస్తూ పోడు భూముల పరిష్కారం అయ్యే వరకు అధికారులు పోడు వ్యవసాయం చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ person అంగోతు బిందు, ఎం.పి.- మాలోతు కవిత, ఎమ్మెల్యే లు హరిప్రియ, శంకర్ నాయక్, CFO భీమ్ల నాయక్, ఎస్పీ – కోటి రెడ్డి, ఐటిడిఎ పి. ఓ. గౌతం, డి.ఎఫ్. ఓ. రవికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారి చేయనైనది.

Share This Post