పోడు వ్యవసాయ దారుల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్హులైన పోడు వ్యవసాయదారులు అందరూ సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

నంబరు, 08, ఖమ్మం:

పోడు వ్యవసాయ దారుల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అర్హులైన పోడు వ్యవసాయదారులు అందరూ సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేల కాయల పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తవిసి బోరు, చీమలపాడు గ్రామాలలో సోమవారం నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రెండు విడతలుగా చేపట్టిన పోడు పట్టాల పంపిణీలో ఇంకను అర్హులుగా మిగిలిన పోడు వ్యవసాయ దారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలను జారీ చేసేందుకు, అదేవిధంగా ఇక ముందు అటవీ సంపద ఆక్రమణలకు గురి కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న ప్రతి క్రైమ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామ సభ తుది నిర్ణయం మేరకు సబ్ డివిజనల్, జిల్లా. స్థాయి కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనికి గాను గ్రామస్థాయిలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా బేధాభిప్రాయాలు లేకుండా పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత దరఖాస్తు ఫారాలు గ్రామపంచాయతీ కార్యదర్శి వద్ద అందుబాటులో ఉన్నాయని, గ్రామ సభకు హాజరుకాని వారు పంచాయతీ కార్యదర్శి నుండి దరఖాస్తులు పొంది సమగ్ర సమాచారంతో అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో తిరిగి సమర్పించాలని గ్రామ ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్థాయి అధికారులు దరఖాస్తుదారులకు విస్తృత అవగాహన పరచి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు.

మండల స్పెషల్ ఆఫీసర్ అజయ్ కుమార్, తాసిల్దార్ కె. రవి కుమార్, ఎంపీడీవో కె. జమలారెడ్డి, తవిసిబొదు, చీమలపాడు గ్రామ సర్పంచులు భూక్యా రమణ, యం. కిషోర్, గ్రామ కార్యదర్శులు వెంకట్, ఎం భాస్కర్, సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు గ్రామ సభలో పాల్గొన్నారు .

Share This Post