పోడు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకుంటూనే అడవులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

అక్టోబర్ 31, 2021. ఆదివారం కొత్తగూడెం క్లబ్బులో పోడు భూములు, అడవుల పరిరక్షణకై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోడు భూములు మొత్తం కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయని, 2005 కంటే ముందు జీవనోపాధికి వెసులుబాటు కల్పించేందుకు చట్టం అందుబాటులోకి తెచ్చి కటాఫ్ తేదీని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. పోడు సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గారు ఉన్నతస్థాయి కమిటిని ఏర్పాటు చేశారని, పోడు సమస్యను పరిష్కరించొద్దను కుంటే ఇది కేంద్రప్రభుత్వ సమస్య అని చెప్పొచ్చని, కానీ గిరిజనులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో పాటు అడవులను సంరక్షించాలనే ధ్యేయంతో పోడు సమస్యను పరిష్కరించేందుకు సియం మూలాలను పరిశీలన చేసి తగు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 10,13,698 ఎకరాలు, అటవీ భూములుండగా ఇందులో 2,29,229 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు చెప్పారు. జిల్లాలో ఇదివరకే 86,709 మంది రైతులకు పోదు పట్టాలు జారీ చేశామని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతమైన మన జిల్లాలో దట్టమైన అడవులతో 66 శాతం అడవులున్నాయని అడవులపై ఆధారపడి జీవించే హక్కు మాత్రమే ఉందని నిర్ధారించబడినట్లు ఆయన చెప్పారు. వందల ఎకరాలు గిరిజనులకు నరకగలిగే శక్తి ఉందా, గిరిజనుల సమస్యల పట్ల తనకు స్పష్టమైన అవగాహన ఉందని, తాను గిరిజనులతో కల్సి జీవించినానని మంత్రి గుర్తు చేసుకున్నారు. గిరిజనులు చిన్న ఏరియాను. ఎంచుకుని వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతుంటారని, కానీ వందల ఎకరాలు అడవి నరకబడిందని ఆయన చెప్పారు. 2005 తరువాత చట్టం వచ్చినా గత ప్రభుత్వాలు సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని, సమస్య పరిష్కారం కాకపోగా అశ్రద్ధ చేయబడిందని, కొందరు గిరిజనులను ప్రోత్సహించారని కూడా ఆయన వివరించారు. ‘జఠిలమైన పోడు సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రేనని చెప్పారు. పోడు సమస్యను పరిష్కరించుకుంటూనే అడవులను పరిరక్షించుకోవాలన్న లక్ష్యంతో కూలం కషంగా చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారంనకు సదవకాశం ఉందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి మనందరం పరస్పరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అడవులు తగ్గిపోవడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల నేడు పర్యావరణంలో సంబవిస్తున్న మార్పులను చూస్తున్నామని, అడవులను కాపాడుకోక పోతు భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి కూడా మన భావితరాలకు అందలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. అడవులు తరిగిపోవడం వల్ల అనుభవిస్తున్నామని, గాలి కూడా లభించని పరిస్థితి ఉందని అడవుల నరికివేతను ఆపాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. నాటేది ఒకటైతే నరికేది 10 శాతం ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం ప్రతి గిరిజనుడుకి, గిరిజనేతరుడుకి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. ఈ నెల 8వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు క్లెయిమ్స్ స్వీకరించి సోదు హక్కు పట్టాలు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పోడు సమస్యను పరిష్కరించేందుకు అడుగు ముందుకు వేస్తున్నామని అడ్డుపడి చక్కటి కార్యక్రమానికి విఘాతం కలిగించొద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వానికి బాసటగా ఉండాలని ఆయన అఖిలపక్ష సభ్యులను కోరారు. పోడు క్లెయిమ్స్ స్వీకరణకు అధికారులు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నేడు ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ ఆధారిత సంస్కరణలు వల్ల నేడు భూమి ధరలు పెరిగాయని, వ్యవసాయం కూడా బావుందని, రైతును రాజు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో రైతుకు బరోసా లభించినట్లు ఆయన వివరించారు. పోడు సమస్య పరిష్కారానికి గ్రామస్థాయి నుండి పార్లమెంటు సభ్యుల వరకు బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ధరణి కార్యక్రమంతో భూ సమస్యల పరిష్కారానికి శాశ్వతమైన పరిష్కారం లభించిందని, పోడు క్లెయిమ్స్ ద్వారా ఈ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ముఖ్యమంత్రి చేపట్టినా ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మంచి కార్యక్రమం. చేపట్టడం పట్ల సియం గారికి కృతజ్ఞతలు తెలిపారు. పోడు సమస్యలతో సుదీర్ఘకాలం నుండి ఏజన్సీలో యుద్ధ వాతావరణం ఉన్నదని, జీవనం కొనసాగించే వారు పట్టాలు కొరకు తిరుగుతున్నారని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో పోడు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని, అర్హులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పారు. గతంలో పట్టాలు జార్లో సమన్వయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, అటవీ ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించాలని చెప్పారు. చట్టం కంటే మానవత్వం చాలా ముఖ్యమని, పదవులు, హెూదాలు ముఖ్యం కాదని, నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేస్తామని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సియంకు ధన్యవాదాలు. తెలిపారు. | ఇల్లందు శాసనసభ్యులు హరిప్రియ మాట్లాడుతూ పోడు సమస్యతో పంట సాగు చేయాలంటే రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలున్నాయని, ఈ విపత్కర సమస్యను పరిష్కరించడానికి అందరి సహకారం అవసరమని చెప్పారు. ఇల్లందులో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వలేదని, వ్యవసాయం చేస్తున్నా అటవీ అధికారులు రిజర్వు ఫారెస్టుగా నమోదు చేశారని, అట్టి భూములకు రైతుబంధు కూడా వస్తున్నదని, పట్టాలు మాత్రం ఇవ్వలేదని చెప్పారు.. 2005 తరువాత కూడా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. వైరా శాసనసభ్యులు రాములు నాయక్ మాట్లాడుతూ పోడు సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రతిష్మాత్మకంగా తీసుకోవడం చాలా సంతోషమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా చాలెంజ్ గా తీసుకున్నదని, ప్రతి కుంట, సెంటు భూమికి ఓనరు నిర్ధారిస్తామని చెప్పారు. గిరిజనులు, గిరిజనేతరులు స్వాధీనంలో ఉన్న భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పారు. దేశంలో ఎవరూ సాహసం చేరని, సియం చేశారని, ఇది చాలా జరిలమైన సమస్య అని సానుకూలంగా పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ పోడు సమస్య పరిష్కరించాలని సియం గారు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోవు సమస్యను పరిష్కరించడంతో పాటు అదువులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నదని చెప్పారు. కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు మాట్లాడుతూ పోడు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. పోడు సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సియం దృష్టికి తెచ్చామని నాడు ఆయన మాట ఇచ్చారని, ఆ ప్రకారం నేడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం చాలా సంతోషమని చెప్పారు. భూములు సర్వే చేసి సమస్యను పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 40-50 సంవత్సరాల నుండి ఉన్న భూమి అటవీ భూములుగా చూపారని, ఎవరికి ఎంత భూమి ఉన్నదో నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉన్నట్లు ఆయన తెలిపారు. పేదోళ్లకు న్యాయం జరగాలన్నదే మనందరి లక్ష్యమని చెప్పారు. శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనేతరులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదని, అటవీ చట్టం కేంద్రప్రభుత్వ పరిధిలో ఉంటుందని, ఎవరైనా చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. చాలా కాలం నుండి పోడు చేసుకుంటున్నారని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమస్య పరిష్కారానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భూములు చూడకుండా పట్టాలు జారీ చేశారని, అటువంటి వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నట్లు ఆయన తెలిపారు.

మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి మాళోత్ కవిత మాట్లాడుతూ పోడు సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి మహబూబాద్లో జరిగిన సభలో ప్రకటించి నేడు ఆచరణకు చర్యలు తీసుకోవడం చాలా సంతోషమని చెప్పారు. గ్రామస్థాయి నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం కలిగినట్లు ఆమె వివరించారు. పట్టాలు మంజూరు చేసేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సంతోషమని చెప్పారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పోడు సమస్య పరిష్కారానికి ఇదొక చక్కటి అవకాశమని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ పోడు సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు, అటవీ అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారని చెప్పారు. పోడు సమస్య చాలా జఠిలమైనదని, పోడు దారులకు పట్టాలు ఇవ్వడం ఒక ఎత్తయితే అడవులను సంరక్షించుకోవడం మరొక ఎత్తని చెప్పారు. పోడు సమస్యను పరిష్కరించిన తదుపరి ఒక్క అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, అడవుల సంరక్షణకు పాటు పడతామని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అఖిలపక్షం నాయకులు సాబీర్పాష, సిపిఐ, దుర్గా ప్రసాద్, కాంగ్రెస్, మిడియం బాబురావు, సిపియం, కోనేరు నాగేశ్వరావు, బిజెపి, గంధం మల్లికార్జునరావు, బిఎస్పీ, నారాయణదొర, గుమ్మడి నర్సయ్య, ఐపిఐ ఎంఎల్, టిడిపిలు పోడు సమస్య పరిష్కారంపై పలు సూచనలు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఎస్సీ సునీల్ దత్, ఐటిడిఏ పీఓ గౌతం, సిఎఫ్ఎ బీమా నాయక్, డిఎఫ్ రంజిత్, జడ్బీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు సీతాలక్ష్మి, వెంకటేశ్వర్లు, అన్ని మండలాల జడ్పీటిసిలు, యంపిపిలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post