పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి

ప్రెస్ నోట్

పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి IAS…

మహబూబాబాద్ నవంబర్ 6.

జిల్లాలోని పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి శనివారం సమీక్షించారు.

కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు పాల్గొనగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీక్షించారు.

ఎఫ్‌ఆర్‌సిఎస్‌ల సంఖ్యను ఏర్పాటు చేశామని, ఎఫ్‌ఆర్‌సిఎస్‌కు అన్ని పరిపాలనా సహకారాన్ని అందించడానికి గ్రామపంచాయతీ స్థాయి బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించే పద్ధతిని శిక్షణ ఇచ్చినట్లు కలెక్టర్ వివరించారు.

హైదరాబాద్ లో 2021 అక్టోబర్ 23 వ తేదీన జరిగిన కలెక్టర్ల సమావేశంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ పర్యవేక్షించడానికి మండల, డివిజన్ స్థాయిలో సీనియర్ స్థాయి జిల్లా అధికారులను నియమించామన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ పోడు సాగుచేస్తూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలందరికీ తప్పనిసరిగా ROFR పట్టాలు అందించాలని, ప్రభుత్వ భూమిలో పునరావాసం కల్పించాలని, జీవనోపాధి పథకాన్ని అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

పోడు కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అందుకు తగిన ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీకున్న జిల్లా కలెక్టర్ తో పాటుగా అధికారులందరినీ ఆమె అభినందించారు.

అర్హులైన పేదలందరికీ గరిష్ట ప్రయోజనం అందేలా చూడాలని కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో అటవీశాఖ ఉన్నతాధికారి భీమ్ల నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇన్చార్జి ఏఎస్పి యోగేష్ గౌతం అదనపు కలెక్టర్ కొమరయ్య ఎఫ్ డి ఓ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు

———————————————————————————————–

Share This Post