పోడు సాగు చేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తులు సమర్పించాలి…

ప్రచురణార్థం

పోడు సాగు చేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తులు సమర్పించాలి…

మహబూబాబాద్ నవంబర్-12 :

పోడు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తున్న అర్హులైన రైతులు హక్కు పొందేందుకై దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి పరిధి మొట్లగూడెం, సండ్రాలగూడెం గ్రామాల్లో పర్యటించి ఏర్పాటుచేసిన పోడు భూములు – అటవీ సంరక్షణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

పోడు సాగు చేస్తున్న కంబాల పల్లి పరిధిలోని గురిమిల్ల, సురేష్ నగర్ ర్ రైతులు కూడా అటవీ హక్కుల కమిటీ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని తద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇది ఒక మంచి అవకాశంగా భావించాలన్నారు.

అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి 10 ఎకరాలు మంజూరు చేస్తామన్నారు రైతులు గ్రామ పెద్దల వాంగ్మూలం తోపాటు ఏదైనా ఒక ఆధారం సమర్పించాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2005 డిసెంబర్ 13 తేదీలోపు సాగు చేసుకుంటున్న రైతులకు పోడు భూముల హక్కు పత్రాల జారీకి చర్యలు తీసుకుంటున్నదన్నారు.

గిరిజనేతరులు 1930 సంవత్సరానికి పూర్వం నుండి సాగు చేస్తున్నవారు అర్హులన్నారు. హక్కు పత్రాలు పొందితే రైతు బంధు, బీమా, పంటరుణాలను పొందేందుకు అర్హులన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగు చేస్తున్న రైతులకు భూమిపై హక్కు కల్పించడంతో పాటు, కొత్తగా పోడు ను అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నదన్నారు.

ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు 90శాతం గిరిజనులని, గతంలో 20 మంది హక్కు పత్రాలు పొందారని, ఆ సమయంలో మరికొంత మంది తగిన ఆధారాలు చూపలేక 600 ఎకరాలకు 56 మంది ఉన్నారని 23 మంది మాత్రమే దరఖాస్తులందించారని 30 మంది ఇవ్వాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గిరిజనాభివృద్ది అధికారి దిలీప్ కుమార్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, ఎంపిడిఓ రవీందర్, ఎం.పి.ఓ. హరిప్రసాద్, తహసీల్దార్ రంజిత్, మొట్లతండా ,సండ్రాల గూడెం సర్పంచ్ లు సుమన్, జక్కలక్ష్మీ, ఎఫ్.ఆర్.సి. చైర్మన్లు యాదగిరి, లక్ష్మయ్య, ఎఫ్.ఎస్.ఓ. బాలనాగు, ఎఫ్.బి.ఓ. వీరన్న, పంచాయతీ సెక్రటరీ ఉష, నరేందర్ గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post