ఐలమ్మ 126 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏఓ ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
ఐలమ్మ పోరాటాలకు గుర్తుగా, భవిష్యత్ తరాలకు ఆమె చరిత్రను తెలియజేసేందుకు
మహానీయుల కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆమెకు సముచిత గుర్తింపు, గౌరవాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి సురేందర్, ర.భ. ఈ ఈ భీంలా, కలెక్టరేట్ సిబ్బందితో పాటు ఈ దిగువ తెలిపిన రజక, బిసి సంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు