పోరాడి సాధించుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుదాం….. మంత్రి సత్యవతి రాథోడ్*

పోరాడి సాధించుకున్న  తెలంగాణ ను బంగారు తెలంగాణ గా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుదాం….. మంత్రి సత్యవతి రాథోడ్*

మహబూబాబాద్ జూన్ 2,2023.

పోరాడి సాధించుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుదాం అని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి లో జూన్ 2వ తేదీన ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలోజడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్, జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత,ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి లతో కలిసి మంత్రి పాల్గొని

పోలీస్ శాఖ వారిచే గౌరవ వందనం స్వీకరించిన ఆనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి 2014 సంవత్సరం రాష్ట్రం అవతరించిన నాటి నుండి నేటి వరకు సాధించిన ప్రగతిని జిల్లా అభివృద్ధి ప్రగతి నివేదిక ద్వారా సందేశాన్ని చదివి వినిపించారు.

ముందుగా మంత్రి జిల్లా ప్రజలకు అధికారులకు ,ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ నాడు ఉద్యమ సారధిగా నిలబడి నేడు ముఖ్యమంత్రిగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి ఒక్కతాటిపై నడిపించి ఉద్యమ స్ఫూర్తి నీ రగిలించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో కృతకృత్యులయ్యారు.

భావి భారత పౌరులకు ప్రయోగాత్మకమైన విశిష్టమైన అభివృద్ధి పథకాలను, సంక్షేమ ఫలాలను దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజలకు అందిస్తున్నారని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అన్ని రంగాలలో అభివృద్ధి నీ వేగవంతంగా ముందుకు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ట్లు చెప్పారు.

సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న ఈ మహా యజ్ఞంలో మనమందరం పాలుపంచు కొని సమిధలు గా నిలవాలని మంత్రి ఆకాక్షించారు.

విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక సంప్రదాయ నృత్యాలు, బంజారా నృత్యం, సెల్ఫ్ డిఫెన్స్ (కరాటే), తెలంగాణ గీతాలపై విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చెయ్యగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్రత్యేక రాష్ట్ర సాధనకై అశువులు బాసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సత్కరిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. ప్రాణ త్యాగాలపైనే తెలంగాణ నిర్మాణం జరిగిoదన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించి మంత్రి అభినందించారు.

వివిధ శాఖలు దశాబ్ద కాలంగా సంక్షేమ ప్రగతి పై చేపట్టిన అభివృద్ధి పై ఐ డి ఓ సి లో ఏర్పాటుచేసిన స్టాల్స్ లో ప్రదర్శించడం తో మంత్రి, కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్, ఎంపీ , ఎమ్మెల్యేలు , ఎస్పీ, అదనపు కలెక్టర్లతో కలిసి మహిళా శిశు దివ్యంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా పశు వైద్య- సంవర్ధక శాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ, మత్స్య శాఖలు, స్వయం సహాయక సంఘాల సభ్యులచే తయారు చేయబడిన ఉత్పత్తులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- పేదరిక నిర్మూలన సంస్థ( సెర్ప్), జిల్లా పోలీస్ శాఖల, సఖి కేంద్రం వన్ స్టాప్ స్టాల్స్ ను మంత్రి సందర్శించి పరిశీలించి జిల్లా అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తూ వారు చేస్తున్న కృషిని అభినందించారు.

సీఎం కప్- 2023 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో వాలీబాల్ లో ద్వితీయ స్థానం గెలుపొందిన అమ్మాయిల జట్టును మంత్రి అభినందించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని జిల్లాకు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అభినందించారు.

ఐ డి ఓ సి లోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన ఏసీ ఇండోర్ గేమ్స్ రూమును మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, కలెక్టర్ ఎస్పీ అదనపు కలెక్టర్ లతో టేబుల్ టెన్నిస్, క్యారం బోర్డ్ ఆడి, అధికారులు పని వత్తిళ్లలో ప్రశాంతత కోసం ఆట విడుపుకు చక్కటి ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

అనంతరం కలెక్టర్ గారు ఏర్పాటుచేసిన తేనేటి విందులో ప్రజా ప్రతినిధులు అధికారులతో మంత్రి పాల్గొన్నారు.

ఈ అవతరణ వేడుకలలో, ఏ సి ఎల్ బి అభిలాష అభినవ్, ఏసీ రెవెన్యూ డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, వైస్ చైర్మన్ ఫరీద్, ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Share This Post