పోలింగ్ కు 72 గంటల ముంద ప్రచారం ముగించాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పోలింగ్ కు 72 గంటల ముంద ప్రచారం ముగించాలి :

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

000

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజురాబాద్ ఉప ఎన్నికలు ఈ నెల 30 న జరగనున్నందున ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ కు 72 గంటల ముందు అనగా అక్టోబర్ 27 సాయంత్రం 7-00 గంటల నుండి అక్టోబర్ 30 వరకు నిశబ్ధ కాలం (సైలెన్స్ పిరియడ్) అని ఆయన తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 సెక్షన్ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, ప్రజలను ప్రచారానికి సమీకరించరాదని, మీడియా కార్యక్రమాలు నిర్వహించరాదని, ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రాఫీ, టెలివిజన్, ప్రచార సామాగ్రి ప్రజలకు తెలిపే విధంగా ప్రదర్శించరాదని, మ్యూజికల్, వినోద కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారి పై రెండు సంవత్సరముల శిక్ష, ఫైన్ లేక రెండునూ విధించబడునని ఆయన తెలిపారు.

Share This Post