పోలింగ్ కేంద్రం పరిధిలోని వ్యక్తుల యొక్క ఓటు తొలగింపులో నోటీసులు జారీ చేసిన తదుపరి మాత్రమే ఓటరు జాబితాలో పేర్లు తొలగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

 సోమవారం పాల్వంచ మండలం జగన్నాధ పురం గ్రామం పోలింగ్ కేంద్రం 81 లో మరణించిన మాలోత్ గాంధీ వయసు 30 సంవత్సరాలు తండ్రి చాంప్ల ఓటు తొలగింపుపై అతని ఇంటికెళ్లి విచారణ నిర్వహించారు.  ఓటు హక్కు తొలగింపుపై తహసీల్దార్ జారీ చేసిన నోటీస్ ను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు తొలగింపులో తప్పని సరిగా  దరఖాస్తు ఆధారంగా ఓటు హక్కు తొలగింపు ప్రక్రియను  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాలోత్ గాంధీ ఓటు హక్కు తొలగింపుపై తహసీల్దార్ కార్యాలయం ద్వారా జారీ చేసిన నోటీస్ ను పరిశీలించారు.  కుటుంబ సభ్యులను నోటీస్ జారీ గురించి, గాంధీ ఓటును ఎందుకు తొలగిస్తున్నారో వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.  గాంధీ మరణించాడని అందువల్లనే తమకు నోటీస్ జారీ చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఓటరు జాబితాలో పేర్లు తొలగింపులో తప్పని సరిగా నోటీస్ లు జారీ చేయాలని, నిర్దేశిత గడువులోగా సరియైన ఆధారాలు చూపని పక్షంలో మాత్రమే ఓటు హక్కును తొలగించాలని చెప్పారు.  ఈ నెల 20 వ తేదీ వరకు అన్ని క్లెయిమ్స్ పూర్తి చేయాలని చెప్పారు.

Share This Post