పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు దూరం వరకు ఓటర్లును తప్ప ఎవరినీ అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. శుక్రవారం కొత్తగూడెం ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు జరుగుతుందని, ఓటర్లు నిర్దేశిత సమయంలోనే ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల తరువాత పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించమని, పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగానికి వేచి యున్న ఓటర్లుకు వెనుక నుండి క్రమసంఖ్యతో కూడిన స్లిప్పులు జారీ చేయాలని సెక్టోరియల్ అధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలోనికి బడి కార్డులున్న వ్యక్తులను మాత్రమే అనుమతించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లు, కెమేరాలు, చేతిగడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, నీళ్ల సీసాలు, హ్యాండ్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు అనుమతించొద్దని, నిశిత పరిశీలన యాలని చెప్పారు. ఓటుహక్కు వినియోగం పూర్తిగా సీక్రెట్ పద్ధతిలో జరుగుతుందని, ఫోటోలు తీయడం ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నేరమని చెప్పారు. పోలింగ్ ప్రక్రియపై ప్రతి 2 గంటలకు ఎన్నికల కార్యాలయానికి శాతం వివరాలు నివేదికల పంపాలని ఎన్నికల పర్యవేక్షకులును ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు దూరం నిషేద ప్రాంతమని ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఉన్న ట్రెజరీ కార్యాలయానికి సెలవు ప్రకటించినట్లు చెప్పారు. కొత్తగూడెం క్లబ్బు, దేవాలయంలో సేవలు నిని వేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో అత్యవసర వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, వైద్యునితో పాటు ఏయన్యం తదితర సిబ్బందితో పాటు అత్యవసరం మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఈ -ఎన్నికల్లో 305 మంది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 221 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియను వెడ్కాస్టింగ్ చేయుటకు చేసిన ఏర్పాట్లును పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో సెక్టోరియల్ అధికారులుగా భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీఓలు వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఓటుహక్కు వినియోగానికి వచ్చిన ఓటర్లును గుర్తించడానికి మున్సిపల్ కమిషనర్లుకు, యంపిడిఓలకు విధులు: కేటాయించినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి ఖమ్మం రిసెప్షన్ సెంటర్లో మెటీరియల్ అప్పగించే వరకు పోలింగ్ సిబ్బంది తిరిగి వెళ్లడానికి వీల్లేదని, అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ జరిగిన తదుపరి మాత్రమే రిసెప్షన్ కేంద్రాన్ని వీడి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఓటర్లు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సమాజిక దూరం పాటించాలని చెప్పారు. ఓటర్లు క్యూ లైన్ ద్వారా మాత్రమే ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, ఏఎస్పీ ప్రసాదరావు, డిఎస్పీ వెంకటేష్బాబు, తదితరులు పాల్గొన్నారు

Share This Post