పోలింగ్ కేంద్రాల ను సందర్శించిన అదనపు కలెక్టర్


పోలింగ్ కేంద్రాలను సందర్శించి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ
పెద్దపల్లి డిసెంబర్ 8::- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ బుధవారం సందర్శించారు. స్థానిక సంస్థల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. పెద్దపల్లి లోని ఎంపీడీవో సమావేశ మందిరం, మంథని ఎంపీడీవో సమావేశ మందిరాల్లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు.పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు,పి. ఓ.లకు తగు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కె.నరసింహమూర్తి,పెద్దపల్లి తహసీల్దార్ శ్రీనివాస్, మంథని తహసీల్దార్ బండి ప్రకాష్,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post