పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించవలి – జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించవలి – జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్థానిక సంస్థల నియోజక వర్గ మెదక్ శాసన మండలి ఎన్నికలకు నియమించిన నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16 నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టగా 7 మంది అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు వేశారని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 జెడ్.పి .టి.సి. ఏం.పి .టి.సి., మునిసిపల్ కౌన్సిలర్ ఓటర్లకు గాను 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 150 మంది ఓటర్లకు ఒక బూతు ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా నరసాపూర్ లోని ఆర్.డి.ఓ. ఆఫీసులో 68 మంది ఓటర్లకు, తూప్రాన్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో 64 మంది ఓటర్లు, స్నాగారెడ్డి లోని టి.యెన్.జి.ఓస్ భవనం లో 251, సంగారెడ్డి ఆర్.డి.ఓ.అందోల్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో 59, నారాయణఖేడ్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో 89, జహీరాబాద్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో 85, సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 162, గజ్వెల్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో 99 మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నోడల్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు, కౌంటింగ్ రోజు మెదక్ లో పొలిసు బందోబస్తు, బ్యారికేడింగ్ ఏర్పాటు చూడవలసినదిగా డి.ఎస్.పి . సైదులుకు సూచించారు. పోలింగు కు ప్రిసైడింగ్ అధికారులుగా ఏం.పి .ఓ. ల తో పటు ఇతర సిబ్బందిని , అదేవిధంగా నాలుగు టేబుళ్లలో జరిగే కౌంటింగ్ కు సిబందిని ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వవలసినదిగా స్వీప్ నోడల్ అధికారికి సూచించారు. బ్యాలట్ పేపర్ ముద్రణ పనులు చూడవలసినదిగా డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ ను, పోలింగ్ ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాటుచేవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని నివేదికలను సకాలంలో పంపేలా చూడవలసినదిగా జిల్లా పౌర సరఫరాల అధికారి, వెబ్ క్యాస్టింగ్, వీడియో కవరేజి కై యెన్.ఐ.సి అధికారికి సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సిబ్బంది, పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లుటకు వాహనాలు సమకూర్చవలసినదిగా జిల్లా రవాణాధికారి కి సూచించారు. అదేవిధంగా ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రతి కేంద్రంలో అవసరమైతే షామియానా, కుర్చీలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయవలనదిగా అధికారులకు సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షించవలనదిగా ఆర్.డి.ఓ. సాయి రామ్ కు సూచించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, సి.పి .ఓ. పర్యవేక్షిస్తారని అన్నారు. ఎన్నికల నియమావళి సరిగ్గా అమలయ్యేలా చూడవలసినదిగా మైన్స్ సహాయ సంచాలకులు జయరాం ను జిల్లా ఎన్నికల అధికారి హరీష్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సహాయ ఎన్నికల అధికారి రమేష్, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, ఎన్నికల నోడల్ అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, సూపరింటెండెంట్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post