పోషకాహార లోపంతో ఏ ఒక్క శిశువు బాధపడకుండా చుకోవాల్సిన బాధ్యత ఒక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ పైనే కాకుండా లైన్ డిపార్ట్మెంట్ లు అందరూ బాధ్యతలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పోషకాహార లోపంతో ఏ ఒక్క శిశువు బాధపడకుండా చుకోవాల్సిన బాధ్యత ఒక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ పైనే కాకుండా లైన్ డిపార్ట్మెంట్ లు అందరూ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్యం, ఐ.టి.డీఏ, ఫారెస్ట్, మున్సిపల్, ఆర్ అండ్ బి, ఉద్యాన వనం, పంచాయతీ రాజ్ తదితర శాఖాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ పర్యటన సందర్బంగా వారు గుర్తించిన అంశాలు వాటిని పారిష్కారించేందుకు చేపట్టాల్సిన చర్యల పై అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 6 వేల మంది 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు బాధపడుతున్నట్లు గణాంకాలు ఉన్నాయని, వీటిని మరిమారు ఖచితత్వంతో సర్వే చేస్తే మరింత మంది పిల్లలు ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి ముందుగా పకడ్బందీగా సర్వే నిర్వహించి గుర్తించిన పిల్లలకు పోషకాహార లోపం నుండి బయటపడేసి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేదుకు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో వీరిని ఆరోగ్యవంతులను చేయడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సరిగ్గా తినని పిల్లలను ఆకలి పరీక్షలు నిర్వహించాలని, గుర్తించిన స్యామ్ మ్యామ్ పిల్లలను వైద్య శాఖ ద్వారా పిల్లలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించి తగు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్యామ్ మ్యామ్ పిల్లల ఇంటికి అంగన్వాడీ టీచర్లు క్రమం తప్పకుండా గృహసందర్శన చేసి వారి ఇంట్లో ఏమైనా పరిశుభ్రత సమస్యలు ఉన్నాయా, ఏ రకమైన ఇబ్బందులతో బాధ పడుతున్నారు, వారికి ఎటువంటి పోషకాహారం అందించాలి లేదా ఎంత మొత్తంలో అందించాలి అనే పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా స్యామ్ మ్యామ్ ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తీసుకొని వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ వంతు బాధ్యతలను నివర్తించి జిల్లాలో స్యామ్ మ్యామ్ పిల్లలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతమైన జిల్లా గా తీర్చిడిద్దెందుకు కృషి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ మను చౌదరి, జిల్లా సంక్షేమ అధికారిణి వెంకటలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్ లాల్, డి ఎఫ్.ఓ కిష్టా గౌడ్, పి.డి డిఆర్డీఏ నర్సింగ్ రావు, డిపిఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post