పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణానికి అందరు సహకరించాలి :  జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణానికి అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో పోషణ మాసం పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి సంబంధీత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో క్షేతస్థాయిలో పోషణ లోపాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని, ఈ నెల ౩వ తేదీ నుండి రోజు వారీ కార్యక్రమాలు పకద్భందీగా నిర్వహించాలని, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు కూడా పోషకాలు అందజేసేలా వ్యవసాయ శాఖ సహాయం తీసుకొని ముందుకు సాగాలని, జిల్లా అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన పోషణ -శానిటేషన్‌ కమిటీ వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కమిటీ సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో రైతులు ఒకే రకమైన పంటను కాకుండా చిరుధాన్యాలు సాగును 27 వేల ఎకరాల నుండి లక్ష ఎకరాలకు పెంచాలని, డిసెంబర్‌ నాటికి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో చిరుధాన్యాలు అందించే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, రైతులు స్థానికంగా కూరగాయలు పండించే విధంగా ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అక్టోబర్‌ 2 నాటికి డిజిటల్‌ తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లాలోని ఉత్తమ గ్రామపంచాయతీల మండలానికి 3 చొప్పున అంగన్‌వాడీ లను ఎంపిక చేయాలని, వాటికి స్మార్ట్‌ టీవీలను అందజేయడంతో పాటు సంవత్సరానికి సరిపడా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నెల రోజుల పాటు పోషణ మాసం పండగ వాతావరణంలో జరిగేలా చూడాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రామపంచాయతీలు ప్రాథమిక పాఠశాలలో “న్యూటబ్రీ గార్డెన్‌” ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో అవసరమైన పండ్లు, చిరుధాన్యాల మొక్కలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందని, మొక్కల పరిరక్షణపై సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, ఈ కార్యక్రమం విజయవంతమైతే రబీ సీజన్లో ప్రతి గ్రామంలో 40 నుండి 50 ఇండ్లలో “న్యూట్రి గార్జెన్‌ లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, జిల్లా వైద్యాధికారి మనోహర్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఈ. ఈ. రామ్మోహన్‌ రావు, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు తదితరుల పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post