పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

గురువారం న్యాల్కల్ మండలం, ముంగి గ్రామ పంచాయతీ లోని అంగన్వాడీ కేంద్రము లో పిల్లల తల్లిదండ్రుల తో ఏర్పాటు చేసిన SAM- Seviority Acute Malnutrished(తీవ్ర పోషకాహార లోపం) SUMb(Seviority Under Weight) తక్కువ బరువు పై) సమావేశానికి హాజరయ్యారు.

పిల్లల బరువు ను నిరంతరం పర్యవేక్షించాలని, మంచి పోషక విలువలున్న ఆహారము పిల్లలకు అందించాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రం ఆవరణలో కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం లో గర్భిణీ స్త్రీలకు మరియు 5 సంవత్సరాలలోపు పిల్లలకు అందించ వలసిన పౌష్ఠిక ఆహారం తప్పకుండా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్ కు ఆదేశించారు.

SAM మరియు MAM లో వున్న పిల్లల పై ప్రత్యేక శ్రద్ద వహించి మంచి పౌష్ఠిక ఆహారం అందించి వారిని సాధారణ స్థితి కి తీసుకు రావాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిధిలో SAM మరియు MAM పిల్లలు లేకుండా తగిన ఆహారం అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ సంక్షేమ అధికారి శ్రీమతి బ్రహ్మాజీ, సూపర్వైజర్ , సర్పంచ్, మండల పంచాయితీ అధికారి , పంచాయితీ సెక్రటరీ పాల్గొన్నారు.

అనంతరము గ్రామ పంచాయతీ లో వున్న నర్సరీని ఆయన సందర్శించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు సంచుల ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాటిలో తగిన మట్టి , పోషకాల మిశ్రమం కలిపి తయారు చేసుకోవాలని తెలిపారు.

అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో వున్న బృహత్ పల్లె ప్రకృతి వనంను పరిశీలించి, ఇంకా 1000 మొక్కలను నాటాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ DRDO జయదేవ్, మండల పంచాయతి అధికారి శ్రీనివాస్, సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.

Share This Post