పోషణలోప రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం…..2 తేదిః 18-11-2021
పోషణలోప రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, నవంబర్ 18:
జగిత్యాల జిల్లాను పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోషణ లోపం గల పిల్లలపై తీసుకోవలసిన చర్యలపై సిడిపిఓ, సూపర్వైజరులు మరియు ఇతర అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది రోజువారి పనులను పరిశీలించాలని పేర్కోన్నారు.
ప్రభుత్వం ద్వారా అంగన్వాడి కేంద్రాలకు వచ్చే బాలామృతం, కోడిగుడ్లు సక్రమంగా అందించాలని, పిల్లలో మొదటి 5 సవంత్సరాలలో మాసనసిక, శారీరక ఎదుగుల ఉంటుందని ఆ సమయంలో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని అన్నారు. అంగన్ వాడి కేంద్రాలకు వచ్చే సరుకులు, పిల్లల తల్లితండ్రులు వాటిని ఎవిధంగా వాడుతున్నారన్న విషయాలపై సిబ్బంది క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని అన్నారు. మాల్ న్యూట్రిషన్ పై ఇతర లైన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలియచేసారు.
సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సాధించిన ప్రగతిలో పెద్దగా పురోగతి ఎమిలేదని, క్షేత్రస్థాయి పర్యటనలు, అవగాహన కార్యక్రమాలు కేవలం కొందురు మాత్రమే నిర్వహించడం, అధికారులు మా పనికాదని, క్రింది స్థాయి వారు నిర్వహించేదిగా బావించడం ద్వారా పురోగతిలో వెకనబడిపోతున్నామని, అంగన్ వాడి ఆయా నుండి అధికారి వరకు అందరు ప్రతిపని తమదేనని బావించి, కలిసికట్టుగా పనిచేసినప్పడే శాఖాపరంగా అభివృద్దిని సాధించగలుగుతామని పేర్కోన్నారు.
పోషణ లోపం 0% గా ఉన్నప్పడే ప్రగతిలో మనం ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుందని, పర్యవేక్షణ సరిగా లేకపోడం పనులపై నిర్లక్యంగా వ్యవహరించడం లాంటవి లేకుండా చూడాలని, మీ కేంద్రం పరిదిలో పోషణ లోపం 0% గా ఉండేలా చూసులకోవాలని, మీ సెక్టార్ లో పోషకలోపం ఉన్నవారు ఎంత మంది ఉన్నారు గమనించాలని, తద్వారా మెరుగైన సేవలను అందించ గలుగుతామని పేర్కోన్నారు.
నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం, పుట్టిన తరువాత పిల్లలకు తల్లి పాలు సక్రమంగా ఇవ్వకపోవడం, సకాలంలో వ్యాక్సిన్ లు ఇవ్వక పోవడం వంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ఇతర శాఖల సమన్వయంతో పోషణ లోపం వంటి కేసులు లేకుండా చేయగలుగుతామని పేర్కొన్నారు. 2 నెలల చాలెంజ్ గా తీసుకోని డాక్టర్లు, డైటిషన్ల సహాయ, సహకారాలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
అనంతరం జగిత్యాల జిల్లాలో కరోణాతో తల్లితండ్రులు చనిపోయి అనాధలుగా మారిన పిల్లలకు, కేర్ ఇండియా ఫౌండేషన్, హైదరాబాద్. ద్వారా చిన్నారులకు నిత్యవసర వస్తువులను జిల్లా కలెక్టర్ ద్వారా అందజేసారు.
ఈ కార్యక్రమంలో కేర్ ఇండియా డిస్టిక్ కో ఆర్డినేటర్ అజయ్ మరియు జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్, సీడీపీవోలు, సిడిపిఓలు, సూపర్ వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

పోషణలోప రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జి.రవి
పోషణలోప రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జి.రవి
పోషణలోప రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జి.రవి
పోషణలోప రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జి.రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post