పోషణ్ అభియాన్ ద్వారా పిల్లల ఎదుగుదలకు అన్నిరకాల పోషణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రిక ప్రకటన                                                                    తేది 08.09.2021

పోషణ్  అభియాన్  ద్వారా పిల్లల ఎదుగుదలకు అన్నిరకాల పోషణ కార్యక్రమాలు చేపట్టాలని   జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి    అన్నారు.

 బుదవారం కల్లెక్టరేట్ సమావేము  హాలు నందు ఇంటింటా పోషణ సంబరాలు   సెప్టెంబర్   01 నుండి  30  వరకు   పోషణ  మాసం   సందర్బంగా     సంబంధిత   అధికారులతో   సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  చిన్నారుల్లో   ఎదుగుదల లేకపోవడం, పోషకాహార లేమి,  తక్కువ  బరువుతో   శిశువు   జననం,  గర్భిణీ లు,  పాలిచ్ఛే తల్లులు,  బాలికల్లో   రక్తహీనత   లోపం  శాతాన్ని  పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు    నిర్వహించాలని ,   సిడిపిఓలు  ప్రతి రోజు ఇంటింటికీ తిరిగి   పోషణ  కార్యక్రమాల పై అవగాహన కలిగించాలని అన్నారు.  . కోవిడ్ – 19  నివారణ చర్యలను అనుసరించాలన్నారు.  ప్రతి అంగన్వాడి సెంటరులో పిల్లల హాజరు శాతం పెంచాలి, ఆకూ కూరలు, కాయగూరలు  మెనూ ప్రకారం బోజన ఏర్పాట్లు చేయల్లన్నారు.  అంగన్వాడి  కేంద్రాలలో పరి శుబ్రత  కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గర్భవతులకు  విటమిన్ సి  ,ఐరన్, అధికంగా ఉండే పోషక ఆహరం గురించి  వివరించలన్నారు. పాటశాలలో  పోషణ్ మానిటర్ ను నియమించాలని,  విద్యార్థుల కు పోషకాహారం పై  వ్యాస రచన పోటీలు  నిర్వహించి, కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేసే విదంగా   అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి పాటశాలలో పిల్లలందరూ చేతులు సుబ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతి సెక్రటరీ, సర్పంచ్ ల ద్వారా  గ్రామాలలో పోషణ్ అభియాన్ కార్యక్రమాలపై  అవగాహన కల్పించాలన్నారు.  సూపర్ వైజర్లు, ఏ ఇ లు ప్రతి అంగన్వాడి సెంటర్ను విసిట్ చేసి  వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు  చేయాలనీ  అన్నారు.  ప్రతి సెంటర్లో గుడ్లు , బాలమృతం  ఇస్తున్నారా, గర్బిని స్త్రీలకు సంబందించిన , రక్త హీనత కలిగిన పిలల్ల డేటా ఉంధా?.పోషణ్ అభియాన్ పై ఎన్ని సమావేశాలు నిర్వహించారు డేటా మొత్తం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి సిడిపి ఓ   ఎస్ హెచ్ జి సబ్యులతో మాట్లాడి  రిపోర్ట్స్ అని ప్రోపర్ గా ఉండేలా చూడాలన్నారు.

        తదనంతరం  పోషణ మాసం సందర్భంగా ఎదుగుదల పర్య వేక్షణ, మరియు ప్రోత్సాహం  పోస్టర్ ను విడుదల చేశారు.  ప్రతి ఇంటికి సరైన పోషణ , పోషకాహారం ,త్రాగు నీరు, పరి శుబ్రతల పై అవగాహన కల్పిస్తానని అందరితో ప్రతిజ్ఞ చేయించారు .

 సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, మాతా శిశు సంక్షెమ శాఖ అధికారిని ముసాయిదాబేగం, డి ఆర్ డి ఓ  ఉమాదేవి, ఆర్ డబ్యు ఎస్ శ్రీదర్ రెడ్డి,  ఎస్తేరాన్ని, మధుసూదన్ రెడ్డి, సిడి పి ఓలు ,  సూపర్ వైజర్ లు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

Share This Post