పిల్లల్లో పోషణ లోపం తగ్గించాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
పిల్లల్లో పోషణ లోపం పై సమీక్ష
-000-
పిల్లల్లో పోషణ లోపాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ మాసంలో భాగంగా పిల్లల ఎదుగుదల, పోషణ లోపం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లల సంఖ్య శాతం తగ్గించడానికి ప్రతి బుధవారం అంగన్వాడీ కెంద్రాలలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సమావేశాల్లో న్యూట్రిషన్ కు సంబంధించిన ఆహర పదార్ధాలను ప్రదర్శించడంతో పాటు పిల్లల తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల పిల్లలను ప్రజా ప్రతినిధులు, ఎన్.జి.వో.లు. 6 నెలల వరకు దత్తత తీసుకొని పిల్లల పెరుగుదలను మెరుగుపర్చాలని కోరారు. రక్తహీనత ముక్త్ భారత్ లో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందరికి రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రక్తహీనతతో భాదపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ కు సంబంధించిన ఆహార పదార్ధాల గురించి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రవీందర్, సి.డి.పి.వో.లు, పోషణ అభియాన్ సిబ్బంది, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.