పోషన్ అభియాన్ అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది…

ప్రచురణార్థం

పోషణ యాన్ అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది…

మహబూబాబాద్ సెప్టెంబర్ 8.

పోషన్ అభియాన్ అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని తెలిపినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

బుధవారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని గుమ్ముడూరు రైతు వేదికలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.

పోషణ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ముందుందని స్వయంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి మంత్రివర్యులు శ్రీమతి స్మృతి ఇరాని తెలిపినట్లు మంత్రి చెప్పారు.

18 సంవత్సరములు నిండిన యువతులకు వివాహ వయసు గా పరిగణిస్తూ వివాహాలు చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి పథకం అమలు పరచడం ఆరోగ్య లక్ష్మి పథకం కింద మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ఆరు నెలల తర్వాత ప్రతి నెలకు రెండు వేల చొప్పున శిశువును ప్రసవించిన మూడు నెలల వరకు ఆరు నెలల కాలానికి గాను 12 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయటం మహిళా శిశు సంక్షేమానికి నిదర్శనమన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్టు అందజేయటం మరో అద్భుత పథకంగా తెలియ చేస్తూ తద్వారా గతంలో 23 నుండి 24 శాతం కాన్పుల ప్రగతి ఉండగా ప్రస్తుతం 65 శాతం పెరిగిందని ఈ కీర్తి ప్రశంశలు రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కుతాయి అన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్డు సరఫరా పై సమావేశం ఏర్పాటు చేసి గుడ్డు బరువు తగిన రేట్లు చెల్లించినా నాణ్యమైన గుడ్లు సరఫరా చేయకపోవడం పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు.

అంగన్వాడీ సిబ్బంది సేవలను గుర్తించి వేతనాలను పెంచడం జరిగిందన్నారు అంగన్వాడి కేంద్రాలలో బాలామృతం తీరు బాగుందని, కేంద్రమంత్రి ప్రశంసించగా గిరి పోషణ పేరుతో సజ్జలు జొన్నలు మక్కలు తో పోషక ఆహారాన్ని సరఫరా చేయాలని మంత్రిని కోరామన్నారు.

పుట్టిన శిశువు మెదడు రెండు సంవత్సరముల వరకు దినదినాభివృద్ధి చెందుతున్నందున మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు ఉండాలని
ఐఏఎస్ అధికారులతో బృందం ఏర్పాటు చేసి సమస్యలను అధిగమించేందుకు అధ్యయనం చేయాలని కోరామన్నారు.

మరోవైపు అబార్షన్స్ పై చర్యలు చేపట్టామన్నారు. జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలన్నారు. గర్భిణీ మహిళలను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ లకు వెళ్లకుండా నచ్చ జెప్పాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలియజేయాలన్నారు . ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం లో పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలియజేశారు మహిళా శిశు సంక్షేమ శాఖ లో 80 వేల మంది సిబ్బంది ఉన్నారని రాష్ట్రమంతా మెచ్చుకునేలా 96 బాల్యవివాహాలను నిలుపుదల చేశా మన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ పోషక లోపం రహిత జిల్లాగా ఇతర జిల్లాలకు ఆదర్శంగా మహబూబాబాద్ జిల్లాను నిలుపుతామని అన్నారు మరుగుదొడ్ల ఆవశ్యకత గుర్తించినట్లు గానే పోషణ అభియాన్ ను గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పోషణ అభియాన్ పై ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా కుటుంబ సభ్యులలో ఆలోచన పెంపొందించేందుకు మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు అంగనవాడి కేంద్రాలను అన్ని వసతులతో అభివృద్ధి పరుస్తామన్నారు.

మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ తల్లిపాలే శ్రేయస్కరం అన్నారు పోషణ అభియాన్ జనచైతన్య సభను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు త్రాగు నీటిని వేడి చేసి వడబోసి వినియోగించాలన్నారు నాటు కోడి గుడ్డు గ్రామాలలో లభిస్తాయని పాలు పెరుగు వంటి బలవర్థకమైన ఆహారం తో శిశువులను ఆరోగ్య వంతమైన శిశువులుగా తీర్చి దిద్దుతూ సమాజాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

అనంతరం గర్భందాల్చిన ఐదుగురు మహిళలకు శ్రీమంతం మరో ఐదుగురు శిశువుల అన్న ప్రాసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా రెండు సంవత్సరాల పాలన దిగ్విజయంగా జరిగినందున మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం పౌష్టిక ఆహారం పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి తిలకించారు.

ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగ వాణి, సభ్యులు అశోక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, సి డి పి వో లు వార్డ్ కౌన్సిలర్ సరస్వతి గద్దె రవి అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారిచేయనైనది

Share This Post