మహబూబాబాద్ జూన్ 2, 2023.
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ నమోదు గడువును 15 రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు
మహబూబాబాద్ జిల్లాలోని షెడ్యూల్ కులాలు (ఎస్సీ) షెడ్యూల్ తెగలు (ఎస్టి) వెనుకబడిన తరగతి (బిసి) ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఇబిసి), మైనార్టీలు మరియు (పిహెచ్సి) విద్యార్థుల కోసం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గాను పోస్టుమట్రిక్స్ స్కాలర్షిప్ల నమోదు కోసం వరకు 15 రోజుల వ్యవధిని ప్రభుత్వం గడువు పెంచినది. కావున జిల్లాలోని అన్ని కళాశాలలు విద్యార్థినీ విద్యార్థులు 2022 2023 విద్యా సంవత్సరానికి గాను రెన్యువల్ మరియు ఫ్రెష్ స్కాలర్షిప్ల మంజూరి కోసం తేదీ01-06-2023 నుండి 15-06-2023 వరకు http://telanganaepass.cgg.gov.in (ఈ పాస్పోర్టల్లో అప్లై చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే. శశాంక నేడు ఒక ప్రకటనలో తెలిపారు.