పౌర సరపరాలు, తూనికలు,కొలతలు, పెట్రోల్ బంక్ డీలర్లు,ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ లతో సమావేశం: జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

పత్రికా ప్రకటన
నల్గొండ, ఆగస్ట్ 24.పెట్రోల్ బంక్ లలో వినియోగ దారులకు టాయిలెట్ లు, త్రాగు నీరు,ప్రీ ఎయిర్ సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో పౌర సరపరాలు, తూనికలు,కొలతలు శాఖ అధికారులు పెట్రోల్ బంక్ డీలర్ లు,ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ లతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్,డీజిల్ కల్తీ లేకుండా అమ్మకాలు నిర్వహించాలని,కల్తీ జరిగినా,కనీస సౌకర్యాలు లేకున్నా తనిఖీ లు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ అధికారి,సహాయ పౌర సరఫరాల అధికారి,తూనికలు,కొలతలు శాఖ అధికారి,పౌర సరఫరాల శాఖ డి.టి.లు,ఆయిల్ కంపెనీ ల సేల్స్ ఆఫిసర్ లతో టాస్క్ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టనున్న ట్లు ఆయన తెలిపారు.ఈ తనిఖీ లో నిబంధనలు పాటించని బంక్ లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కస్టమర్లతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యా నందం,తదితరులు పాల్గొన్నారు

Share This Post