పౌష్టికాహార లోపం అధిగమించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి – రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి

పౌష్టికాహార లోపం అధిగమించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి – రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి

భావి తరాలకు ఆరోగ్యవంతమైన సమాజం అందించాలంటే గర్భిణులకు,బాలింతలకు, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. పోషన్ మహా-2021 లో భాగంగా జాతీయ మహిళా కమీషన్ ఆధ్వర్యంలో మంగళవారం నర్సాపూర్ బి.వి.ఆర్.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏ.యెన్.ఏం.లు తదితరులకు ఏర్పాటు చేసిన పోషన్ పంచాయితీ అవగాహన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే పౌష్టికాహారం అందించడంలో ఉన్న లోపాలను గుర్తించి అందరికి బలవర్ధకమైన ఆహారం అందేలా చూడాలని అన్నారు. ఇందుకోసం జిల్లా, మండల స్థాయిలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో తరచు కన్వర్జెన్సీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవగాహన కలిగించాలని అన్నారు.
రాష్ట్రంలో చాలా మంది మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధ పడుచున్నారని, మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంతో దృడంగా ఉంటారని అన్నారు. కాబట్టి గర్భిణులు సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని, గర్భస్థం నుండి వేయి రోజుల వరకు పిల్లల ఎదుగుదలకు ఇది చాలా కీలకమని లేనిచో బలహీనంగా ఎదుగుదల లేకుండా, ఎత్తు పెరగకుండా ఉంటారని అన్నారు. రాష్ట్రంలో రక్తహీనతతో సుమారు 65 శాతం మహిళలు బాధపడుచున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని అన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి ని ప్రారంభించి పౌష్టికాహారం అందిస్తున్నది, ఐ రన్ మాత్రలు, పుట్టిన పిల్లలకు ఇమ్మ్యూనైజేషన్ టీకాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగిన ప్రసవాలకు కె.సి.ఆర్.కిట్లు, 13 వేళా నగదు అందజేస్తున్నదని అన్నారు. మేడృగిన పౌష్టికాహారం ఏ విధంగా అందించాలో అధ్యయనం చేయుటకు 7, 8 మంది ఐ.ఏ.ఎస్. అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయగా వారుకూడా నివేదిక అందించారని త్వరలో ప్రభుత్వం తగు కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. లింగ వివక్ష లేని సమాజం నిర్మించుటకు జిల్లాలో 50 గ్రామాలలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని సునీత తెలిపారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర మహిళా కమీషన్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది, ఏమైనా సమస్యలుంటే కమీషన్ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని అన్నారు.
నరసాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పోషన్ అభియాన్ పై ప్రజలలో అవగాహన కలిగించాలని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలను దేశానికి అందించి దృఢమైన పౌర సమాజాన్ని నిర్మించవలసిన భాద్యత మనపై ఉందని అందుకనుగుణంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
అనంతరం డిజిటల్ పోస్టల్ ను విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, రంగుల పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఓ., వైద్య ఆరోగ్య శాఖ, సి.డి.పి .ఓ., ప్;పోలీసు, ఎస్.బి.ఐ. బ్యాంకు వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను , బతుకమ్మలను తిలకించారు.
ఈ కార్యక్రమంలో మెదక్, సంగారెడ్డి ఇళ్ల పరిషద్ చైర్ పర్సన్ లు హేమలత శేఖర్ గౌడ్, మంజు శ్రీ, మునిసిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, కమీషన్ సభ్యులు షహీన్ , ఈశ్వరీ బై, జెడ్.పి .టి.సి.లు, ఏం.పి .పి .లు , మహిళా శిశు సంక్షేమాధికారి జయరాం నాయక్, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా అధికారులు, సి.డి.పి ఓలు, హేమాభార్గవి సూపెర్వైజర్లు, ,ఏ.యెన్.ఏం.లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post