పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని సాధారణ స్థితికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సిడిపిఓలు ,సూపర్వైజర్లకు ఆదేశించారు.

 

పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని సాధారణ స్థితికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సిడిపిఓలు ,సూపర్వైజర్లకు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు పౌష్టికాహార లోపం గల పిల్లలను గుర్తించడం, పిల్లల ఎత్తు బరువు తీసే విధానం, బిడ్డ పెరుగుదల కు తీసుకోవలసిన పాటించవలసిన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో రాజర్షి పాల్గొని మాట్లాడుతూ
గ్రోత్ మానిటరింగ్, (SAM, MAM) అతి తక్కువ, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లల గుర్తింపు, తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసుకు తగ్గ ఎత్తు బరువుతో బిడ్డ ఆరోగ్య, పోషణ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. పిల్లలలో తీవ్ర పోషణ లోపం భవిష్యత్ తరానికి ప్రమాదం అన్నారు. ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే మంచి బలవర్థకమైన ఆహారాన్ని తల్లులు తీసుకునేలా చూడాలని తెలిపారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సాలిటర్ స్కేల్, ఇన్ ఫాంటో మీటర్, స్టేడియో మీటర్, డిజిటల్ వేయింగ్ స్కేల్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆయా పరికరాలు పాడైపోయిన, పనిచేయని చోట వెంటనే ఏర్పాటు చేయాలని డి డబ్ల్యూఓ కు ఆదేశించారు. ఆయా పరికరాలతో ఏవిధంగా ఎత్తు బరువులు కొలవాలన్నది పూర్తి అవగాహనతో చేయాలని సూచించారు. వయస్సుకు తగ్గ బరువు ఎత్తు ఎంత ఉండాలి, ఏ విధంగా తీయాలి అన్నదానిపై సూపర్వైజర్ లకు, అంగన్వాడి టీచర్లకు పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.

పిల్లల ఎత్తు బరువు కరెక్ట్ గా నమోదు చేయాలని ,తప్పుగా నమోదు చేయరాదని స్పష్టం చేశారు. ఆయా నమోదు లన్ని అంగన్వాడీ టీచర్లు మాత్రమే చేయాలని సూచించారు.

ఎంతమంది పిల్లలు స్యాం, మ్యామ్, సాధారణం గా ఉన్నది ఎప్పటికప్పుడు సూపర్వైజర్లు పరిశీలించాలన్నారు.

SAM, MAM పిల్లలకు అదనపు బాలా మృతాన్ని ఇవ్వాలన్నారు . సరైన ప్రణాళికతో SAM, MAM పిల్లలను సాధారణ స్థితికి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు.

పోషక లేమి గల పిల్లల విషయంలో ఏఎన్ఎం, ప్రాథమిక ఆస్పత్రి డాక్టర్ సహకారం తీసుకుని ఎన్ ఆర్ సి కి పంపాలని అంగన్వాడి టీచర్లకు సూచించారు.

ముఖ్యంగా అంగన్వాడి ఆయాతో ఉదయమే ఆరోగ్యలక్ష్మి ఆహారాన్ని వండి పనికి వెళ్లే గర్భిణీ మహిళలకు టిఫిన్ బాక్స్ లో పెట్టి ఇంటికి పంపాలని సూచించారు.
పిల్లలు, గర్భిణులు ఇష్టంగా పెరుగు తింటే పాలు పెరుగు గా తయారు చేసి ఇవ్వాలని సూచించారు.

పంచ సూత్రాలు పాటించాలని, శానిటేషన్ నిర్వహణ, శుద్ధమైన త్రాగునీరు ఉండాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేనట్లయితే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వంద శాతం (పౌష్టిక లోపం లేని) ఆరోగ్యవంతులైన పిల్లలు ఉండేలా చూడాలని ఆయన కోరారు.

అంగన్వాడీ కేంద్రాలలో న్యూ ట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఉండాలని రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్డి ఉండేలా చూసుకోవాలన్నారు.

అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పిల్లల ఎత్తు బరువు ఏ విధంగా తీయాలి, నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు అంగన్వాడీ టీచర్ ల తో ఆయా యంత్ర పరికరాలతో ఎత్తు, బరువులను తీయించి పరిశీలించాలి.

ఈ కార్యక్రమంలో, మహిళా శిశు సంక్షేమ అధికారి పద్మావతి, పిల్లల వైద్యులు డా. విజయ్, సి డి పి వో లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post