పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కం కమిషనర్ దివ్య దేవరాజన్ సిడిపిఓలు ,సూపర్వైజర్లకు ఆదేశించారు.

పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కం కమిషనర్ దివ్య దేవరాజన్ సిడిపిఓలు ,సూపర్వైజర్లకు ఆదేశించారు.

బుధవారం ఆమె సంగారెడ్డిలో ఆకస్మికంగా పర్యటించి శిశు గృహ, బాల రక్షా భవన్ ను సందర్శించారు. బాల రక్షా భవన్ కి మహిళా ప్రాంగణంలో భవనాన్ని కేటాయిస్తూ, నిధుల మంజూరుకు ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా పంపాల్సిందిగా సూచించారు. వచ్చే సంక్రాంతి లోగా భవనాన్ని పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆమె కోరారు.

జిల్లాలో కోవిడ్ తో అనాధలై న 9 మంది బాలలకు తక్షణమే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ప్రారంభించాలని ఆమె డి సి పి ఓ కు సూచించారు. కోవిద్ లో భర్తలను కోల్పోయిన మహిళలకు (వితంతు) వితంతు పింఛను మంజూరు చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ రాజర్షి షా కు సూచించారు.

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సి డి పి వో లు, సూపర్వైజర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, సంబంధిత సిబ్బందితో చైల్డ్ ప్రొటెక్షన్, గ్రోత్ మానిటరింగ్, (SAM, MAM) అతి తక్కువ, తక్కువ బరువు గల పిల్లల గుర్తింపు, తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ SAM, MAM పిల్లలకు అదనంగా బాలా మృతాన్ని ఇవ్వాలన్నారు. ఎంత పరిమాణములో బాలామృతం ఇవ్వాలన్నది అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సరైన ప్రణాళికతో SAM, MAM పిల్లలను ఎనిమిది వారాల్లోగా మామూలు స్థితికి తీసుకురావచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్ట్ వారీగా గ్రోత్ మానిటరింగ్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

అంగన్వాడీ టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి పంచ సూత్రాలకు సంబంధించి అబ్జర్వేషన్ చేసి నివేదికను తయారు చేయాలన్నారు. ప్రతి అంగన్వాడి కి నాణ్యమైన సరుకులు అందుతున్నాయని అన్నారు.
గర్భిణీ స్త్రీల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఐరన్ , ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడి ఆయాతో ఉదయమే ఆరోగ్యలక్ష్మి ఆహారాన్ని వండి పనికి వెళ్లే గర్భిణీ మహిళలకు టిఫిన్ బాక్స్ లో పెట్టి ఇంటికి పంపాలని ఆమె సూచించారు. ఆయాలకు స్థానిక వంటకాలలో రుచికరమైన కూరలు, ఆహారాన్ని అందించేలప్రత్యేక శిక్షణనివ్వాలని సూచించారు.

గర్భిణీలకు పాలు కాకుండా పెరుగుగా తయారు చేసి పౌష్టికాహారంగా ఇవ్వాలని సూచించారు.
అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న గుడ్లు నిర్ణీత పరిమాణం కన్నా తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. సిడిపిఓలు ,సూపర్వైజర్లు క్రమం తప్పకుండా అంగన్వాడీ సెంటర్లలో ఆకస్మికంగా తనిఖీ చేసి గుడ్డు పరిమాణాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యురాలు అపర్ణ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు.. ప్రభుత్వం ఎంతో పెద్ద మొత్తంలో పౌష్టికాహారాన్ని అందిస్తుందని, గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అశ్రద్ధ చెయ కూడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డి డబ్ల్యూ పద్మావతి,డి సి పి ఓ రత్నం, సి డి పి ఓ లు, సిడబ్ల్యూసి మెంబర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post