ప్రకటనలు సమాచార శాఖ ద్వారా జారీ చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 23:–

ప్రకటనలు సమాచార శాఖ ద్వారా జారీ చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
జిల్లా నుండి
ప్రభుత్వ శాఖల ద్వారా జారీచేసే ఆర్థికపరమైన ప్రకటనలు, నోటిఫికేషన్లు ,టెండర్ నోటీసులు, భూసేకరణ ప్రకటనలను విధిగా సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారి ద్వారా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 52, తేదీ.17.02.2017 లో ప్రకటనలు జారీ చేయుటకు నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్లు, లోకల్ బాడీ లు నేరుగా పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు,టి ఎస్ ఆర్ టి సి, ట్రాన్స్ కో, జెన్ కో, భూసేకరణ విభాగం ప్రకటనలన్నీ సమాచార శాఖ ద్వారా జారీ చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ అవుట్ డోర్ ప్రకటనల జాబితాలోకి వస్తాయన్నారు.

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు,క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. ఎవరేని నిబంధనలు పాటించనట్లయితే వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ప్రకటనలను నేరుగా గాని, పోస్టు ద్వారా గాని కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, ఇంటి నంబర్ 10-2-1, సమాచార భవన్ ఏసి గార్డ్స్, మాసబ్ ట్యాంక్, ఆపోజిట్ మహావీర్ హాస్పిటల్, హైదరాబాద్ చిరునామాకు పంపాలని సూచించారు.

మరిన్ని వివరాలకు సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల మొబైల్ నెంబర్.9949351678 లేదా అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ అసిస్టెంట్ల మొబైల్ నెంబర్.8341468052/ 8096213239 లలో సంప్రదించవచ్చన్నారు. ప్రకటనలను ipr.tsadvt@gmail.com మెయిల్ కు పంపాలని కలెక్టర్ తెలిపారు.

Share This Post