ప్రకృతివనాలలో వివిధ రకాల మొక్కలను నాటాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
పత్రికాప్రకటన.2 తేదిః 28-08-2021
ప్రకృతివనాలలో వివిధ రకాల మొక్కలను నాటాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అగస్టు 28: జిల్లాలో చేపడుతున్న ప్రగతి పనులలో బాగంగా నర్సరీలు, ప్రకృతి వనాలలో ఒకే రకమైన మొక్కలను కాకుండా వివిధ రకాల మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రగతిపనుల నిర్వహణపై ప్రత్యేకాధికారులు, యంపిడిఓ, యంపిఓ మరియు ఎపియం లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పల్లెప్రకృతి వనాలలో కేవలం ఒకే రకమైన మొక్కలు మరియు పూల మొక్కలను మాత్రమే నాటుతున్నారని, ఆ విధంగా కాకుండా అన్ని రకాల మొక్కలను నాటాలని పేర్కోన్నారు. జిల్లాలో ఉన్నతస్థాయి అధికారులు పర్యటించే అవకాశం ఉన్నందున, పత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులు ప్రతిపనిని పర్యవేక్షించడంతో పాటు నిబద్దతతో పనులను పూర్తిచేయాలని సూచించారు. జాబ్ కార్డ్స్ అప్డేషన్ సక్రమంగా జరగాలని, మొక్కల మద్య ఉన్న గ్యాప్ లలో వేరె మొక్కలను నాటాలని, పనులు ప్రగతిని ఆకస్మిక తనిఖి నిర్వహిస్తానని తెలియజేశారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించబడాలని, గ్రామాలలో సానిటేషన్ సక్రమంగా జరగాలని, పల్లెప్రకృతి వనాలను ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని పేర్కోన్నారు. అవసరమైతే అధనపు లేబర్ ను నియమించి వైకుంఠదామాలు, సెగిరికేషన్ షెడ్, మొదలగు నిర్మాణాలు పూర్తిచేయాలని పేర్కోన్నారు. పూర్తయిన పనికి సకాలంలో చెల్లింపులు జరగాలని, ప్రకృతి వనాలవద్ద వెదురు మొక్కలతో గ్రిన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని, ప్రగతి పనుల నిర్వహణ బాద్యత ప్రత్యేక అధికారులు, పంచాయితి సెక్రటరీలదే అని అన్నారు. ప్రకృతి వనాలలో పాత్ వే ల కొరకు అనవసరంగా ఎక్కువ స్థలాన్ని వినియోగిస్తున్నారని అలా జరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కోన్నారు. జిల్లాలో రైతుభీమా, వృద్దాప్య పించన్లు రెండింటిని పొందుతున్న వారిని గుర్తించి ఎదైన ఒక్కటి మాత్రమే వర్తించేలా చూడాలని, అదే విధంగా రైతుభీమాలో రైతులు, నామినీల ఆదార్ నెంబర్లు ఒకే విధంగా ఉన్నావాటిని సరిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానికసంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, డిఆర్డిఓ పిడి ఎస్. వినోద్, జిల్లా పంచాయితి అధికారి నరేష్, జిల్లా వ్యవసాయా శాఖాధికారి సురేష్, సహకారశాఖ అధికారి రామానుజా చారి ఇతర అధికారులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.
ప్రకృతివనాలలో వివిధ రకాల మొక్కలను నాటాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
