ప్రకృతి వనాలలో పెద్ద చెట్లు నాటి , నాటిన మొక్కలను సంరక్షించాలని, ప్రకృతి పరిరక్షణకు అందరమూ పాటు పడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రిక ప్రకటన                                                         తేదీ 12-11-2021

ప్రకృతి వనాలలో పెద్ద చెట్లు నాటి , నాటిన మొక్కలను సంరక్షించాలని,  ప్రకృతి పరిరక్షణకు అందరమూ పాటు పడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శుక్రవారం గట్టు మండలం, గట్టు , రాయపురం, ఆలూరు గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు. గట్టు మండలం లోని  బృహత్ పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రం ,  జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల, రాయపురం గ్రామంలో నర్సరీ , ఆలూరు గ్రామం లో పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు.  గట్టు మండలం లోని బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు  నాటి నీళ్లు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 16 ఎకరాలలో  ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనం లో పెద్ద చెట్లు నాటాలని, ప్రకృతి వనం చుట్టూ కంచే ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షించాలని, మొక్కలు ఎండిపోకుండా వాటికి రోజుకి రెండు సార్లు నీళ్లు పట్టాలని అన్నారు. మండలం లోని పబ్లిక్ హెల్త్ సెంటర్ ను విజిట్ చేసి, ఓ .పి. వార్డు, టెస్టింగ్ ల్యాబ్ లను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగుల  ఫైల్స్ ను పరిశిలించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎ.ఎన్.ఎం.లు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది  సమావేశాలు ఏర్పాటు చేసుకొని టార్గెట్ ప్రకారము వాక్సినేషన్ పూర్తి చేసెలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ జాబితా ప్రకారము ఇంటింటికి తిరిగి వాక్సిన్ వెయ్యాలని, మండలం లోని అన్ని గ్రామాలలో వాక్సినేషన్ పూర్తి చేయాలనీ అన్నారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి ,  పిల్లలకు ఎలాంటి ఆహరాన్ని అందిస్తున్నారని,  పోషణ లోపం ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారు,  బరువు తక్కువ ఉన్నపిల్లలు ఎంతమంది ఉన్నారని,    అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు రోజు గుడ్లు, పాలు, ఆకుకూరలు వంటి పోషకాలు ఉండే పదార్థాలను అందిస్తున్నామని, అదేవిధంగా బాలమృతం+ కూడా అందిస్తున్నామని, SAM-MAM  పోషణ లోపంతో 4 పిల్లలు ఉన్నారని, ముగ్గురు బరువు తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారని, వారికి రోజుకి రెండు సార్లు పోషక ఆహరం అందిస్తున్నామని, టీచర్  లు కలెక్టర్ గారికి  వివరించారు.  అంగన్వాడి కేంద్రం లో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు. మండలం లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను పరిశీలించి, పాటశాల ఆవరణ లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పాటశాల పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని, పిల్లలందరు పాటశాలకు   వచ్చేలా చూడాలని, టీచర్లను  గ్రామాలకు పంపించి ఇంటింటికి తిరిగి పిల్లలను పాటశాలకు పంపించేలా వారి తల్లి తండ్రులకు అవగాహన కల్పించాలని , వంద శాతం పిల్లలు హాజరయ్యేలా చూడాలని అన్నారు. పాటశాలలోని వంట గదిని పరిశీలించారు. వంట గదిని శుబ్రంగా ఉంచుకొవాలని, మెనూ ప్రకారము పిల్లలకు భోజనం ఏర్పాటు చేయాలనీ అన్నారు.

అనంతరం రాయపురం గ్రామం లో నర్సరీ ని, ఆలూరు గ్రామం లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. రాయపురం నర్సరీలోని మొక్కలను పరిశీలించి , 15 వేల బ్యాగు లలో నల్ల మట్టి, ఎర్రమట్టి నింపి మొక్కలు నాటే విధానాన్ని పరిశీలించారు. ఆలూరు లోని పల్లెప్రకృతి వనం లోని మొక్కలు పరిశీలించి, మొక్కలకు రోజుకి రండు సార్లు నీళ్లు పెట్టి, మొక్కలు బాగా పెరిగేలా చూడాలని అన్నారు. గ్రామలలో ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికి తిరిగి  తడి చెత్త, పొడి చెత్త  వేరు వేరు గా సేకరించాలని, సేకరించిన చెత్త తో ఎరువులు తయారు చేసి మొక్కలకు వేయాలని అన్నారు.

కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డి.పి.ఓ శ్యాం సుందర్, సి.డి.పి.ఓ కమలా దేవి, మెడికల్ అధికారి రాజసింహ, ఎంపిడిఓ రాఘవ, ఎంఆర్ఓ గజఫర్ అలీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయనైనది.

Share This Post