ప్రగతిని చాటేలా జిల్లాలో పండగ వాతావరణం లో ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలి :: రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. ***

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలో అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా జిల్లాలో పండగ వాతావరణం లో ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్,
జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, డి ఎఫ్ ఓ రాహుల్ జాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్, ఇరిగేషన్ సి ఈ విజయభాస్కరరావు, జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్, లతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పై సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9 సంవత్సరాల స్వయం పాలన పూర్తి చేసుకోని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు వైభవంగా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు.

ప్రజలకు త్రాగునీరు,విద్యుత్ వంటి కనీస మౌళిక వసతులు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాల పాలన ముగిసే నాటికి అన్ని రంగాల్లో సమూల మార్పులు సాధించామని, నీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని,
కరెంట్ కష్టాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ నేడు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు.

నీటిపారుదల రంగంలో, విద్యుత్ రంగంలో సాధించిన విజయాల కారణంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, భారీ స్థాయిలో వరి పంట పండుతుందని అన్నారు.

గతంలో ప్రభుత్వ వైద్య రంగం పై ఉన్న అపోహలను తొలగిస్తు ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య రంగం అభివృద్ధి చేశామని, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు, డయాలసిస్ కేంద్రాలు, డయాగ్నొస్టిక్ హబ్, బస్తీ దవఖానాలు,పల్లె దవాఖానాలు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, కేసిఆర్ కిట్, కంటి వెలుగు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశామని అన్నారు.

విద్యా రంగం, గ్రామీణాభివృద్ధి లో అద్భుతమైన ప్రగతి సాధించామని, గ్రామీణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలంగాణ రాష్ట్రం అధిక సంఖ్యలో అవార్డులు వచ్చాయని, అందులో భాగంగా ములుగు జిల్లాకు మూడు కోట్ల నగదు బహుమతి పొంది నందుకు జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం వల్ల ప్రతి రంగంలో తెలంగాణ అద్బుత ఫలితాలు సాధించిందని, మన ప్రగతిని నలుదిక్కులా ఘనంగా చాటుతూ పకడ్బందీగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. దశాబ్ది వేడుకల నిర్వహణ పై ప్రతి మండల పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశ నిర్వహణను రెండు రోజులలో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
రైతులకు నిరంతర కరెంటు రైతు బంధు రైతు బీమా పుష్కలంగా సాగునీళ్లు అందుటు ఉండటంతో వీడు భూములు సస్యశ్యామలంగా మారాయని అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

పోడు రైతుల కల నెరవేరే సమయం ఆసన్నమైనదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలని ఇస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించిందని రామప్ప సరస్సు రిజర్వాయర్గ మారిందని అన్నారు.

మేడారం జాతరకు 100 కోట్లు కేటాయిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు. జిల్లాలో 300 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ములుగు మొదటి స్థానంలో నిలిచేందుకు చేసిన జిల్లా విద్యాశాఖ ను ప్రశంసించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
చోరువుతో జిల్లాలో 52 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. అంకురం నుండి పుట్టుక చావు వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని అన్నారు.

రాష్ట్ర దశాబ్ది వేడుకల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి పోరపాట్లు లేకుండా పకడ్బందీగా మన తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో ఎంపిడిఒ, తహసిల్దార్,
ఎం.పి. ఓ, ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రింద లబ్ది చేకూరిన లబ్దిదారుల వివరాలు గ్రామాల వారిగా నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. సంక్షేమ సంబురాలు సందర్బంగా గొర్రెల పంపిణీ రెండవ విడత ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతం సాధించిన విజయాలు అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు చేసిన మేలు,
వారికి కల్గిన లబ్ది వివరాలు గ్రామాల వారిగా ఫ్లెక్సీలు,
పోస్టర్లు రైతు వేదికలతో పాటు గ్రామాల్లో ముఖ్య ప్రదేశాలో ప్రదర్శించాలని అన్నారు.

సాగునీటి దినోత్సవం సందర్భంగా గతంలో ఉన్న ఆయకట్టు, ప్రస్తుత పరిస్థితి, అదనపు తూములు, చెరువులు, చెక్ డ్యాంల సంపూర్ణ సమాచారం అందించాలని అన్నారు. సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కల్గిన లబ్ది వివరాలతో ప్రతి గ్రామంలో పోస్టర్ ఏర్పాటు చేయాలని, గ్రామాల వారిగా లబ్దిదారుల వివరాలు ప్రజా ప్రతినిధులకు అందించాలని కోరారు.

పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో మారిన స్వరూపం, పెరిగిన పచ్చదనం, మౌలిక వసతులు తెలియజేస్తు గ్రామాల వారీగా నాడు – నేడు పరిస్థితుల ఫోటోలు ప్రదర్శించాలని అన్నారు. అనంతరం 21 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది వేడుకలకు రోజుల వారిగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో జడ్పిటిసి సకినాల భవాని, గై రుద్రమదేవి, పాయం రమణ , తల్లాడ పుష్పలత, కోఆప్షన్ నెంబర్ రియాజ్ మిర్జా, వలియాబి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీ సీఈఓ ప్రసూన రాణి, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, డి సి ఓ సర్దార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, సిపిఓ ప్రకాష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్, డీఈఓ పానిని, డిపిఓ వెంకయ్య, బి డబ్ల్యు ఓ ప్రేమలత, తహసిల్దార్లు ఎం సత్యనారాయణ స్వామి, శ్రీనివాస్, మంజుల, నాగరాజు, ఎంపీడీవో ఇక్బాల్, ఎంఈఓ లు, ఎంపీవోలు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post