డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, వేగంగా జరగాలి
-ఇండ్లు లేని నిరుపేద లే ప్రామాణికంగా
ఎంపిక ఉండాలి
– సిద్దిపేట పట్టణం లో మంజూరైన 1000 ఇండ్లకు వెంటనే టెండర్ లు ఫైనలైజ్ చేయాలి
జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి
ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన పై రెవెన్యూ డివిజన్ అధికారులు, రహదారులు, భవనాలు, ewidc, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ పర్యవేక్షక, కార్యనిర్వహక ఇంజనీర్ లు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్ లతో idoc లో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికే 2621 ఇండ్లు ఇండ్లు లేని నిరుపేద లకు కేటాయించగా, 835 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 270 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
అలాగే దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే 292 ఇండ్లు ఇండ్లు లేని నిరుపేద లకు కేటాయించగా, 1922 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 716 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
జనగామ నియోజకవర్గంలో 117 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 141 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే 1124 ఇండ్లు ఇండ్లు లేని నిరుపేద లకు కేటాయించగా, 2364 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 1642 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 168 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 204 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
మానకొండూరు నియోజకవర్గంలో 98 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 22 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
మొత్తం జిల్లాలో ఇప్పటికే 4037 ఇండ్లు ఇండ్లు లేని నిరుపేద లకు కేటాయించగా, 5504 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 2994 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల లో విద్యుత్, త్రాగునీరు, రోడ్లు తదితర ఇన్ ప్రా స్ట్రక్చర్ గ్యాప్ లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన లో నిర్లక్ష్యం చేసే గుత్తేదారు లను తప్పించి…
బాగా పని చేసే కాంట్రాక్టర్ లకు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే అన్ని మౌళిక సదుపాయాల తో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్లు, ఇండ్ల నిర్మాణం పూర్తి కాబడి మౌళిక సదుపాయాల కల్పన పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూం లకు లబ్దిదారుల ఎంపిక వచ్చే 3 వారాల్లో పూర్తి చేయాలన్నారు.
జిల్లా అధికారులు పర్సనల్ రెస్పాన్స్ బిలిటీగా భావించి క్షేత్ర స్థాయిలో విచారణ సమగ్రంగా చేయాలన్నారు.
లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టాలన్నారు.
ప్రభుత్వం సిద్దిపేట పట్టణము కు కొత్తగా మంజూరు చేసిన 1000 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేసిఆర్ నగర్ కు సమీపంలో నే నిర్మాణం చేపట్ట నున్న దృష్ట్యా సంబంధిత ఇండ్లకు టెండర్ ఫైనలైజ్ చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య,RDO లు, జిల్లా అధికారులు, ఇంజనీరింగు విభాగాల SE,EE,DEE లు, ఎంపిడివో లు, తహసీల్దార్ లు, ఏపీఓ లు పాల్గొన్నారు.