ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం-5
రాజన్న సిరిసిల్ల జనవరి 28: జిల్లాలో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, పలు ఇంజనీరింగ్ విభాగాల పరిధిలో ప్రగతిలో ఉన్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -9, ప్యాకేజీ -12 పరిధిలోని భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ, పెద్దూర్ – బోనాల పరిశ్రమల పార్కు మొదలైన వాటికి సంబంధించిన భూ సేకరణ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి కార్పోరేషన్ వారికి అందజేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 కు అవసరమైన భూ సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని వేములవాడ ఆర్డీఓ ను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఇంచార్జ్ డీఆర్ఓ టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, ఏడీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, డీఆర్డీఓ కె. కౌటిల్య, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

,

Share This Post