ప్రగతిలో జిల్లాను ముందంజలో ఉంచాలి రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్

ప్రగతిలో జిల్లాను ముందంజలో ఉంచాలి

రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్

0 0 0 0 0

     రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసి జిల్లాను అభివృద్దిలో ముందుంచాలని  రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

      గురువారం జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పలు శాఖలకు చెందిన అధికారులతో ధాన్యం కొనుగోలు, హరితహారం, పల్లె ప్రగతి, అభివృద్ధి పనుల పై మంత్రి  సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో  హరిత హారంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముందుగానే లైటింగ్ ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టాలని, పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదిన వెలిచాల గ్రామంలో రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి  దయాకర్ రావు పర్యటన మరియు పల్లెనిద్ర కార్యక్రమం ఉండే అవకాశం ఉందని  పేర్కోన్నారు.   కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ  పనులను త్వరగ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ధాన్యం కోనుగోలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని,  గన్ని బ్యాగుల కొరత లేకుండా డిమాండుకు సరిపోయోలా   తెప్పించు కోవాలని, బ్యాగులలో చెడిపోయినవి, పనికిరానివి ఉన్నట్లయితె వాటిని వాడకుండా తిరిగి పంపించేయాలని సూచించారు.    అటవీ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే  చాలా వెనకబడిపోయిందని రిజర్వు ఫారెస్ట్  ను అభివృద్ది పరిచేలా ప్రణాళికను రూపొందించాలని సూచించారు.  జిల్లాలో రహదారుల  వెంట చేపట్టే ఎవెన్యూ ప్లాంటేషన్ లో చిన్నమొక్కలు కాకుండా పెద్ద మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని,  జిల్లాలో 14కి.మి. ఆర్ఆండ్ బి రోడ్డు వెంట లైటింగ్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు పేర్కోన్నారు.  రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కల్వర్టులలో   స్టాగ్నేషన్ పనులను పూర్తిచేసి  నీరు ఒకే సారి వచ్చిన పేరుకుపోయిన చెత్తకారణంగా నీరునిలువ ఉండకుండా  పునరుద్దరణ పనులను చేపట్టాలని పేర్కోన్నారు.  గ్రామపంచాయితీలలో పెండింగ్ పనుల కొరకు 8 కోట్ల నిధులకు మంజూరు చేయడం జరిగిందని పేర్కోన్నారు.

            ఈ  సమావేశంలో జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్లు  గరిమా అగ్రవాల్,జీవి శ్యాంప్రసాద్ లాల్,  జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలతా,  ఇరిగేషన్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గోన్నారు.

Share This Post