ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రం – పద్మ దేవేందర్ రెడ్డి

ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రం – పద్మ దేవేందర్ రెడ్డి

తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం నూతన విధానాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలతో దూసుకెళుతున్నదని, ఈ ఏడేళ్లలో ఎంతో ప్రగతిని సాధించామని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం మహిళలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు అందించిన అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటు ప్రగతి పధంలో ముందుకెళ్తూ దేశంలో ఎన్నో పథకాలకు తెలంగాణా మార్గదర్శకముగా నిలుస్తున్నదని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ వంటి పథకాలతో పాటు ఆసరా పింఛన్లు ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అర్హులైన మరో 10 లక్షల మందికి పింఛన్లు అందించనున్నామని ఆమె తెలిపారు. పేదలకు రెండు పడకల గదుల ఇల్లు అందిస్తున్నామని, ఈ సంవత్సరం స్వంత జాగా కలిగిన వారు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల ఆర్ధిక సహాయం అందించనున్నమని ఎమ్మెల్యే తెలిపారు. మన ఊరు మన బడి క్రింద మొదటి విడతగా 33 శాతం పాఠశాలను ఎంపిక చేసి 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం త్వరలో 89 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నదని , ఇందులో 95 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు లభించనున్నందున యువతకు పొలిసు, గ్రూప్-I,II,III & IV వంటి ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆమె అన్నారు.
అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకోవడం ద్వారా జిల్లాలో హల్దీవాగు నుండి రైతులకు సాగు నీటిని అందిస్తున్నామని, సింగూరు జలాలను పూర్తిగా మెదక్ జిల్లాకే పరిమితం చేసుకోగలిగామని అన్నారు. 50 కోట్ల వ్యయంతో ఘనపూర్ ఆయకట్ట ఎత్తును పెంచి వేల ఎకరాలకు సాగు నీరందించనున్నామని అన్నారు. 13 కోట్లతో ఏడుపాయలకు సి.సి. రోడ్డు నిర్మించుకోవడంతో పాటు ఒక వలయంగా ఏడుపాయలను పర్యాటక ప్రాంతంగా తీర్దిదిద్ద్దుటకు 100 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పరచనున్నామని అన్నారు . త్వరలో మెదక్ కు రైలు రాబోతున్నదని, ఇక్కడ ఒక రాక్ పాయింట్, టెర్మినల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, తద్వారా వ్యాపార లావాదేవీలు పౌంజుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Share This Post