ప్రగతి లక్ష్యాలను సాధించాలి:: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రగతి లక్ష్యాలను సాధించాలి:: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

మహబూబాబాద్ ఫిబ్రవరి 2
ప్రభుత్వ అభివృద్ధి పథకాలలో నిర్దేశించిన ప్రతి లక్ష్యాలను అప్పనిసరిగా సాధించాలని స్థానిక అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

గురువారం ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులతో మన ఊరు మనబడి కంటి వెలుగు ఉపాధి హామీ తదితర పథకాల లక్ష్యాలు సాధింపు పై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ… మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన మోడల్ స్కూల్స్ త్వరితగతిన ప్రారంభించాలన్నారు.

కంటివెలుగు కార్యక్రమంలో ప్రజలు అత్యధికంగా పాల్గొని పరీక్షలు చేయించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విస్తృత ప్రచారం జరిగే విధంగా పర్యవేక్షించాలి అన్నారు. సాధ్యమైనంతవరకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ కంటి పరీక్షలలో లక్ష్యాల సాధింపుకై కృషి చేయాలన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వినియోగించుకునేలా నిరుపేద కూలీలను ప్రోత్సహించాలన్నారు.

Share This Post