ప్రచురణార్థం…..1 తేదీ.07.06.2023 **బీ.సి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం 9న లాంచనంగా ప్రారంభం:: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్* జయశంకర్ భూపాలపల్లి జూన్ – 7: బీసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా లాంచనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంగారెడ్డి నుండి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో సమావేశంలో పాల్గొనగా, హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో సమావేశం నిర్వహించి బి.సి. కుల, వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించగా, జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం నుండి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. *బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ* ప్రభుత్వం బీసి కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు అందిస్తున్నామని అన్నారు. జూన్ 9న సీఎం కేసీఆర్ మంచిర్యాలలో లాంచనంగా ప్రారంభిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 లబ్దిదారులకు మించకుండా సహాయం అందించాలని అన్నారు. బీసీ కులవృత్తుల చేతి వృత్తుల వారు ఆన్ లైన్ లో ఈ రోజు సాయంత్రం వరకు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్దిదారుల ఎంపిక చేయాలని అన్నారు. జూన్ 9న లాంచనంగా ప్రారంభిస్తున్నామని, జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన తరువాత విచారణ చేపట్టి ప్రతి నెలా దశల వారిగా లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. బీసి కులవృత్తులు చేతివృత్తుల వారికి అందించే ఆర్థిక సహాయం కోసం రెండు సంవత్సరాల క్రితం ఆదాయ ధ్రువీకరణ పత్రం అంగీకరించాలని, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం ధృవీకరణ పత్రం మొదలగు పత్రాలతో జూన్ 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 20,2023 వరకు ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్దిదారుల జాబితా ఇంచార్జీ మంత్రి ఆమోదం పోందిన తరువాత వెబ్ సైట్ లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఆ జాబితా వరుస క్రమం ప్రకారం ప్రతి నెలా 15 తారీఖు లోపు పారదర్శకంగా ఆర్థిక సహాయం అందుతుందని, స్థానిక ఎమ్మెల్యల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.జూన్ 9న రెండవ విడత గోర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని సూచించారు. *మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,* బీసీ కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి చోప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం లక్ష రూపాయలు అందిస్తుందని, దీనిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం యూనిట్ గ్రౌండ్ చేసి సదరు ఫోటోలు ఆన్ లైన్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జూన్ 9న లాంచనంగా బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రతి నెలా 15వ తారీఖు నాడు దశల వారీగా లబ్దిదారులకు సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా లక్ష రూపాయల నిధులు వైద్య శాఖ నుంచి విడుదల చేస్తున్నామని, పండుగ వాతావరణంలో వైభవోపేతంగా వైద్య శాఖ దినోత్సవం నిర్వహించాలని పేర్కొన్నారు. వైద్యశాఖలో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందించాలని అన్నారు. వైద్య శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగులకు చీరలు పంపిణీ చేయాలని, ఏఎన్ఎం లకు బీపి యంత్రాలు అందించాలని అన్నారు. 24 జిల్లాలలో కెసిఆర్ న్యూట్రిషన్ పథకాలు ప్రారంభించాలని తెలిపారు. రాష్ట్ర శాతంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని, వైద్య విద్యార్థులను వేడుకలకు ఆహ్వానించాలని, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలసిస్, కంటి వెలుగు, కేసిఆర్ కిట్ లబ్దిదారుల పాల్గోనేలా చూడాలని అన్నారు. *సి.ఎస్. మాట్లాడుతూ,* బి.సి. చేతి, కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించుటకు గాను ఆన్లైన్ లో జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. పారదర్శకంగా లబ్దిదారుల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా రెండవ విడత గోర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం, అవకాశం ఉన్న చోట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ బి.సి. అభివృద్ధి అధికారి జిల్లా సంక్షేమ అధికారి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post