*ప్రచురణార్థం………..1* తేదీ:06.06.2023 *జిల్లాలో ఘనంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్:: భవేష్ మిశ్రా* తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తేదీ: 06.06.2023 నాడు తెలంగాణ “పారిశ్రామిక ప్రగతి ఉత్సవం” ను జయశంకర్ భుపాలపల్లి జిల్లా లోని ప్రగతి భవన్ లోని సమావేశం మందిరములో నిర్వహించనైనది. ఈ సమావేశాశానికి ముఖ్య అతిథిగా భుపాలపల్లి MLA శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా హాజరైనారు. ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి విశేష ప్రాదాన్యం ఇస్తునారని, ఇట్టి దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మరియు జిల్లాలోపరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రమికవేతలు ముందుకు రావాలని కోరినారు. ప్రభుత్వం తరుపున ఎటువంటి సహయ సహకారాలైన అందించటానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జయశంకర్ భుపాలపల్లి జిల్లా ఎర్పడిన రోజు నుండి జిల్లాలో మీసేవా కేంద్రాలు ప్రజలకు డిజిటల్ వ్యవస్తకు దగ్గర చేయడానికి ఎంతో కృషి చేయుచున్నారని చెప్పినారు. అలాగే ఈ స్పూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు ధరణి, మీసేవలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు, ప్రజలు కృషి చేయాలనీ కోరినారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ భుపాలపల్లి జిల్లా హైదరాబాద్ కూ సూదూర ప్రాంతములో ఉండి, ఎక్కువ అటవీ వైశాల్యం కలిగి ఉన్నందున పారిశ్రామిక అభివృద్ధి గతములో తక్కువగా ఉన్నప్పటికీ, జయశంకర్ భుపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత గృహ నిర్మాణ, ఆతిధ్య, పర్యాటక రంగoలో యెనలేని ప్రగతి సాధించిందని, ఇదే స్ఫూర్తి తో రానున్న రోజులలో అనేక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఊపాది అవకాశాలూ PMEGP, PMFME ద్వారా కల్పించుటకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అగ్రగామిగా కొనసాగుతుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సేగ్గం వెంకట రాణి సిద్దు, జడ్పి వైస్ చైర్మన్ కల్లెపు శోభ రాణి ,అసిస్టెంట్ కలెక్టర్ ఉమశంకర్ ప్రసాద్, EDM శ్రీకాంత్ LDM తిరుపతి TSIIC, Manager, శ్రీ ప్రకాశం , Digiyoda రాకేశ్ మరియు మునిసిపల్ కార్పొరేటర్లు తదితరులూ పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post