ప్రచురణార్థం…..2 తేదీ.07.06.2023 **ప్రజల జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు… రాష్ట్ర మహిళా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్* జయశంకర్ భూపాలపల్లి, జూన్ – 7: రాష్ట్ర రైతులకు జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసిందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం భూపాలపల్లి లోని అన్నారం బ్యారేజ్ వద్ద నిర్వహించిన సాగునీటి వేడుకలలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతి వివరాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రభుత్వం సాగునీటి రంగంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోలను వేడుకలో ప్రదర్శించారు.ఈ సందర్భంగా ముందుగా సరస్వతి అన్నారం ప్రాజెక్టు ను గౌరవ ముఖ్య అతిథులు వీక్షించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత అవసరాలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దార్శనికతతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారని, రికార్డ్ సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ఎత్తుపోతల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు సృష్టించిన అపోహలు అనుమానాలను పటాపంచలు చేస్తూ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని, అందుకోసం వారు చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు త్రాగునీటి సాగునీటి ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎండిపోయిన చెరువులు బావులు కాలిపోయే మోటర్లు రైతులు పడిన కష్టాలు చాలా అధికమని అన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో 13 జిల్లాలకు, 31 నియోజకవర్గాలకు, 121 మండలాలకు, 1638 గ్రామాలకు మీరు సరఫరా చేసే కాలేశ్వరం ప్రాజెక్ట్ ని రికార్డు సమయంలో పూర్తి చేసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో తీసుకున్న చర్యల కారణంగా 2014లో వరి సాగు లో 24 స్థానంలో ఉన్న తెలంగాణ నేడు రెండో స్థానానికి చేరుకుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ.ఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 24 గంటల పాటు ప్రత్యక్షంగా పర్యవేక్షించి రికార్డు సమయంలో వేగవంతంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రజలకు ఫలాలు అందించారని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన లేజర్ షో, ప్రముఖ గాయని మంగ్లీ లైవ్ షో , సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు,వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి,భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, అడిషనల్ కలెక్టర్ లు దివాకర్, ఇలా త్రిపాఠి, అసిస్టెంట్ కలెక్టర్ శివ శంకర్ ప్రసాద్,జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు… జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post